రైతులకు ఈ ఏడాది రూ.1,14,578 కోట్ల రుణాలు

రైతులకు ఈ ఏడాది రూ.1,14,578 కోట్ల రుణాలు

ఈ ఏడాది రూ.లక్షా 14 వేల 578 కోట్ల రైతు రుణాలివ్వబోతున్నామన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రాష్ట్ర బీజేపీ ఆఫీస్ లో మాట్లాడిన ఆయన..రైతుల మద్దతుతోనే కేంద్రంలో అధికారంలోకి వచ్చామన్నారు. రైతులకు నష్టం చేసే చర్యలు కలలో కూడా తీసుకోమన్నారు. ధైర్యంతో సాగు చేస్తేనే ప్రపంచంతో పోటీ పడగలమన్నారు. ఆరేళ్లుగా అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా విద్యుత్ అందిస్తున్నామన్నారు. రైతులకు సరిపడా ఎరువులు, యూరియా అందిస్తున్నామన్నారు.ఎరువుల కొరత లేని దేశంగా మార్చామన్నారు.

రామగుండం ఫర్టిలైజర్ పరిశ్రమను పునరుద్ధరించామన్నారు. ఆరున్నర వేల కోట్లతో రాష్ట్రంలో 4 ఫ్యాక్టరీలు పునరుద్ధరించామన్నారు. భూసార పరీక్షలతో రైతులకు శాస్త్రీయ పద్ధతిలో పంటలపై అవగాహన కల్పించామన్నారు. రైతులకు రుణాలు విస్తృతంగా ఇచ్చామన్నారు. వన్ డ్రాప్-మోర్ క్రాప్ పేరుతో డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సహించామన్నారు. రైతులు, పంటల కోసం ప్రత్యేకంగా టీవీ ఛానెల్ ను ఏర్పాటు చేశామన్నారు. రైతుల అకౌంట్లో నేరుగా రూ.6 వేల సాయం జమ చేస్తున్నామన్నారు కిషన్ రెడ్డి.