కొడుకు కోసం పాత సెక్రటేరియట్ కూల్చిండు :కిషన్ రెడ్డి

కొడుకు కోసం పాత సెక్రటేరియట్ కూల్చిండు :కిషన్ రెడ్డి

తెలంగాణలో విచిత్రమైన పరిపాలన నడుస్తోందని..కొడుకు కోసం కేసీఆర్ పాత సెక్రటేరియట్ ను కూల్చేశారని  బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడలో మీట్ ది ప్రెస్ లో మాట్లాడిన కిషన్ రెడ్డి.. వాస్తు పేరుతో పాత సెక్రటేరియట్ ను కూల్చేసిన సీఎం కేసీఆర్.. కొత్త సచివాలయానికి ఎదుకు రావడం లేదని ప్రశ్నించారు.  కేసీఆర్ నియంతలా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని ఫైరయ్యారు. 

రాష్ట్రంలో 53 శాతం ఉన్న  బీసీలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనన్నారు కిషన్ రెడ్డి.   బీసీని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించిందని.. రాహుల్ గాంధీ, కేటీఆర్ బీసీలను అవమానించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు.  బీజేపీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ను ప్రజా ప్రగతి భవన్ గా మారుస్తామని హెచ్చరించారు.

9 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు  కిషన్ రెడ్డి. దళితుడిని సీఎం చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. . ఉద్యమాల పేరుతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.  ఉద్యమంలో 1200 మంది బలిదానాలకు బాధ్యులెవరని ప్రశ్నించారు. 

Also Read :- పాడి కౌశిక్ రెడ్డి వల్లే బీఆర్ఎస్కు రాజీనామా
 

విపక్షాలను, ప్రజా సంఘాల ఆందోళనలను సీఎం అణిచివేశారని విమర్శించారు. ఒక కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యిందని ఆరోపించారు.  రాష్ట్రంలో సీఎం మంత్రులను కలిసే పరిస్థితి లేదన్నారు.   కేంద్రం నిధులతో తెలంగాణలో జాతీయ రహదారులు అభివృద్ధి చేశామన్నారు కిషన్ రెడ్డి.