కాంగ్రెస్కు ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్లే.. అవిశ్వాస తీర్మానంతో ఒరిగేదేమీ లేదు

కాంగ్రెస్కు ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్లే.. అవిశ్వాస తీర్మానంతో ఒరిగేదేమీ లేదు

కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ రెండు పార్టీలు గతంలో కలిసి గతంలో కలిసి పని చేశాయి..పోటీ కూడా చేశాయని చెప్పారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్, ఎంఐఎంకు ఓటు వేసినట్లేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం  లోపాయికారీ ఒప్పందాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని కోరారు.  కేంద్రంపై అవిశ్వాసం తీర్మానంతో ఒరిగేది ఏమీలేదని కొట్టిపారేశారు. 

ALSO READ :తేజ్ ను కాపాడిన అబ్దుల్ ఫరాన్ ను.. నా గుండెల్లో పెట్టుకుంటా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 


బీజేపీ మాత్రమే బీఆర్ఎస్ తో పోరాటం చేస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు అవినీతి, కుటుంబ పార్టీలేనని ఆరోపించారు. ప్రత్యక్షంగా.. పరోక్షంగా మూడు పార్టీలు అనేక సార్లు తెలంగాణను పరిపాలించాయని చెప్పారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం దగ్గర ఉందని..తెలంగాణలో మార్పు రావాలంటే బీజేపీనే సాధ్యమన్నారు కిషన్ రెడ్డి.