శ్రీశైలం ఘటనను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లా

శ్రీశైలం ఘటనను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లా

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాద ఘటనను కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానన్నారు కిషన్ రెడ్డి. ఈ ప్రమాదంపై అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారన్నారు. సొరంగంలో చిక్కుకున్న సిబ్బంది రెస్య్కూ విషయంలో అన్ని విధాలుగా సహకరించాలని అమిత్  షా ఆదేశించారన్నారు.

ఘటనపై దిగ్బాంత్రి వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి విద్యుత్ సిబ్బందిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా అన్ని విధాల చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదంలో చిక్కుకొన్న సిబ్బంది ఆరోగ్యం, వివరాలపై  ఆందోళన నెలకొందన్నారు. ప్రమాదం గురించి  తెలిసిన వెంటనే ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బందిని కేంద్రం రంగంలోకి దించిందన్నారు. తెలంగాణ యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలు చేపట్టాలని  ఆదేశించామన్నారు. తొమ్మిది మంది ఉద్యోగులు క్షేమంగా బయటికి రావాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాన్నారు.

seee more news

29 లక్షలు దాటిన కేసులు..54 వేలు దాటిన మరణాలు

తెలంగాణలో లక్షకు చేరువలో కరోనా కేసులు