దేశ ఆర్థిక పురోగతిలో చార్టెడ్ అకౌంటెంట్స్ పాత్ర కీలకం

దేశ ఆర్థిక పురోగతిలో చార్టెడ్ అకౌంటెంట్స్ పాత్ర కీలకం

దేశ ఆర్థిక పురోగతి లో చార్టెడ్ అకౌంటెంట్ ల పాత్ర చాలా కీలకమైందని కేంద్ర సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా (ICAI) నిర్వహించిన కాన్వకేషన్ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి హాజరయ్యారు.  తెలుగు రాష్ట్రాల నుండి చాలా మంది విద్యార్థులు చార్టెడ్ అకౌంట్స్ రంగంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరచడం లో చార్టెడ్ అకౌంటెంట్స్ పాత్ర చాలా ముఖ్యమైనదన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఏపీ నుంచి సీఏ పరీక్ష లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గ్రాడ్యుయేషన్ పట్టాలను అందచేశారు.