V6 News

చిన్న మున్సిపాలిటీల్లోఉపాధి పనులు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

చిన్న మున్సిపాలిటీల్లోఉపాధి పనులు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

ఖానాపూర్,  వెలుగు : దేశంలోని చిన్న మున్సిపాలిటీల్లో ఉపాధి హామీ పథకం అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.  బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీశ్  రాథోడ్  ఆధ్వర్యంలో ఆదివారం ఖానాపూర్  మున్సిపల్  చైర్ పర్సన్ అంకం మౌనిక, బీజేపీ కౌన్సిలర్లు కేంద్ర మంత్రిని హైదరాబాద్ లో కలిశారు. 

ఖానాపూర్  పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరుపై వినతిపత్రం అందజేశారు. కొత్తగా ఏర్పడిన ఖానాపూర్  మున్సిపాలిటీలో మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయాలని కోరారు. బీజేపీ నేతలు సత్యవతి, అశోక్, ప్రకాశ్ గౌడ్  ఉన్నారు.