కవిత.. తెలంగాణ పరువు తీసింది: కిషన్ రెడ్డి

కవిత.. తెలంగాణ పరువు తీసింది: కిషన్ రెడ్డి

లిక్కర్ స్కాంలో కవిత అరెస్టుకు.. తెలంగాణ సెంటిమెంట్ కు సంబంధం లేదన్నారు కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఢిల్లీలో కేజ్రీవాల్ తో కవిత చర్చలు జరపలేదా అని ప్రశ్నించారు. కవిత రాష్ట్ర పరువు తీశారని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కవిత అరెస్టుకు.. బీజేపీ సంబంధం లేదని చెప్పారు. కవిత అరెస్ట్ అక్రమం అనడం సరికాదన్నారు. 

లిక్కర్ కేసుతో కవితకు సంబంధం లేదని బీఆర్ఎస్ అంటోందని.. దీనిపై కేసీఆర్ బహిరంగ చర్చకు సిద్దమా అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ అబద్దాలతోనే రాజకీయం చేసిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు అన్ని రకాల మాఫియా చేశారని.. రాష్ట్రంలో మాఫియా పాలన కొనసాగిందని ఆయన విమర్శించారు.  

ALSO READ | కవితకు 14 రోజుల రిమాండ్.. తీహార్ జైలుకు తరలింపు

బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి. మా నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కఠినంగా వ్యవహరించాలని..  దీనిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  ఫోన్ ట్యాపింగ్ కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు కిషన్ రెడ్డి.