కవితకు 14 రోజుల రిమాండ్.. తీహార్ జైలుకు తరలింపు

కవితకు 14 రోజుల రిమాండ్.. తీహార్ జైలుకు తరలింపు

లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ  కోర్టు. ఏప్రిల్ 9వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కవితను జైలుకు తరలించనున్నారు. అరెస్ట్ తర్వాత ఇప్పటి వరకు కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. దీంతో ఢిల్లీలో ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. ఈడీ కస్టడీ ముగియటంతో.. 2024 మార్చి 26వ తేదీ ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరిచారు అధికారులు. 

ఈడీ కస్టడీ నుంచి జ్యూడియషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కల్వకుంట్ల కవితను తీహార్ జైలుకు తరలించనున్నారు అధికారులు. 

ALSO READ :- పార్టీలకు షాకిచ్చిన మెటా - ఇన్స్టాగ్రామ్ లో ప్రచారానికి చెక్..

అంతకుముందు కోర్టులో  కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్  వేశారు. తన కొడుకుకి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. ఏప్రిల్ 16 వరకు కవిత కొడుకుకు ఎగ్జామ్స్ ఉన్నాయని..అప్పటి వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ అభ్యర్థనను తిరస్కరించింది కోర్టు. కవిత బెయిల్ పిటిషన్ పై రిప్లై ఇచ్చేందుకు టైం కావాలని కోరింది ఈడీ. రెండు వర్గాల వాదనలు విన్న కోర్టు.. కవితకు రిమాండ్ విధించింది. కవిత బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1వ తేదీన రెగ్యులర్ వాదనలు జరగనున్నాయి. 

  • Beta
Beta feature