
ఇంటిని నిర్మించుకున్నా.. కట్టిన ఇల్లు కొనుక్కున్నా కచ్చితంగా వాస్తును పాటించాలి. వంటగది.. కొట్టు గది ( ధాన్యం నిల్వచేసేది) చాలా ఇళ్లలో పక్కపక్కనే ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు వాస్తు ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారు సూచిస్తున్న సలహాలనుల ఒకసారి చూద్దాం.. ..
ప్రశ్న: మా ఇంటికి తూర్పు వాకిలి. ఇంటి ఆగ్నేయంలో కొట్టు గది ఉంది. అందులో వడ్లు వేస్తాం. దాని వెనక దేవుడి గది.. తర్వాత వంటగది... కొట్టుగది చిన్నది. వంటగది బాగా పెద్దది. ఆ ఇంట్లో మాకు బాగానే కలిసొచ్చింది. కానీ చాలామంది సిద్ధాంతులు కొట్టుగదిని వంటగది చేయమని సలహా ఇస్తున్నారు. నేను పట్టించుకోలేదు. కానీ మా చిన్నమ్మాయి పెళ్లి ఆలస్యం అవుతోంది. దానికి, ఇంటి వాస్తుకు సంబంధం ఉందంటారా?
జవాబు: సంబంధం ఉండొచ్చు. ఎందుకంటే... ఇంటి దక్షిణంలో నైరుతి భాగం ఎక్కువగా ఉంటే సమస్యలు వస్తాయి. ఇంటిని నాలుగు భాగాలు చేస్తే 1/4 వంటగది ఉండాలి. అంతకంటే ఎక్కువభాగంలో వంటిల్లు ఉంటే ఇబ్బంది.. వంటగది చిన్నదిగా.. కొట్టుగది పెద్దదిగా ఉంటే.. అది దక్షిణభాగం నైరుతి వైపు ఉండకూడదు. అలా ఉంటే దానినిసరిచేసుకోవాలి. ఆ గదిని కూడా 1/4 లోపలే వచ్చేట్టు కట్టుకోవాలి. వంటగది తూర్పు ఆగ్నేయంలో మాత్రమే ఉండాలి. వంట చేసేవాళ్లు తూర్పు ముఖం పెట్టి వండాలి. మీ ఇంటిని మీకు దగ్గర్లో ఉన్న సిద్దాంతికి చూపించి.. సలహాలు తీసుకుని మార్చుకోండి.
బాత్రూం విషయంలో వాస్తు ఇదే..
ప్రశ్న: ఉత్తర సింహద్వారం ఇల్లు తూర్పు వైపు ఐదడుగుల ప్యాసేజ్ ఉంది. ప్యాసేజ్ ఎదురుగా మెట్ల కింది నైరుతిలో బాత్రూం ఉంది. అయితే బాత్రూం ఆ స్థలంలో ఉండొచ్చా? ఇంట్లోకి ప్యాసేజ్ మార్గం గుండా వచ్చేవాళ్లకు ఎదురుగా బాత్రూం ఉండటం కొంత ఇబ్బందిగా ఉంది. తగిన సలహా ఇవ్వండి?
జవాబు: నైరుతిలో బాత్రూం ఉండటం వాస్తు ప్రకారం మంచిది కాదు. దాని వల్ల ఇంట్లో వాళ్లకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. దాన్ని స్టోర్ రూం చేసుకుంటే సరిపోతుంది. బాత్రూం కావాలంటే ఉత్తర వాయువ్యంలో బిల్డింగ్ కు , ఉత్తర కాంపౌండ్ గోడకు తగలకుండా, పడమట గోడకు ఆనించి కట్టుకోవచ్చు. అప్పుడు ప్యాసేజ్ మార్గం నుంచి వచ్చే వాళ్లకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు