ఖిలా వరంగల్ (కరీమాబాద్) వెలుగు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన రాష్ట్రస్థాయి జూడో పోటీలు వరంగల్ లోని కెమిస్ట్ భవన్ లో నిర్వహించారు. పోటీలో కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కివీ పబ్లిక్ స్కూల్ స్టుడెంట్ నాన చంద్రహాస్ బంగారు పథకం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడని పాఠశాల ప్రిన్సిపల్ దాసి సతీశ్ మూర్తి తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 2వ తేదీ నుంచి గుజరాత్ నందియాల్ లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. జాతీయ స్థాయిలో కూడా రాణించి పాఠశాలకు, రాష్ర్టానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రెసిడెంట్ అన్నదేవర ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ దాసి రజిని, కోచ్ ఠాకూర్ రోహన్ సింగ్ పాల్గొన్నారు.