ఆక్లాండ్: ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో మెప్పించిన న్యూజిలాండ్... సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో మరో విజయం అందుకుంది. శుక్రవారం జరిగిన మూడో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సఫారీలను చిత్తు చేసింది. ఫలితంగా ఐదు టీ20 సిరీస్‌లో 2–1తో ఆధిక్యం అందుకుంది. ఈ ఏకపక్ష పోరులో తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన సఫారీ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 136/9 స్కోరు మాత్రమే చేసింది.
మొకోయెనా (26 నాటౌట్), జార్జ్ లిండే (23) టాప్ స్కోరర్లు. కివీస్ బౌలర్లలో జెమీసన్, శాంట్నర్, బీన్ సియర్స్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. లోకీ ఫెర్గూసన్ (1/9) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అనంతరం టామ్ లాథమ్ (63 నాటౌట్), డెవాన్ కాన్వే (39) మెరుపులతో కివీస్ 16.2 ఓవర్లలో 137/2 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. ఫెర్గూసన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 ఆదివారం వెల్లింగ్టన్‌లో జరుగుతుంది.
