ఫోన్ ట్యాపింగ్ : హైదరాబాద్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన కేకే మహేందర్ రెడ్డి

 ఫోన్ ట్యాపింగ్  :  హైదరాబాద్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన కేకే మహేందర్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హైదరాబాద్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి. బషీర్ బాగ్ ఓల్డ్ సీపీ ఆఫీస్ లో సీపీని కలిసి ఆధారాలు సమర్పించారు. సిరిసిల్లలో వార్ రూం ఏర్పాటు చేసి ఫోన్లు ట్యాప్ చేశారని కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. 

సిరిసిల్ల వార్ రూం ఏర్పాటు వెనక కేసీఆర్,కేటీఆర్ హస్తం ఉందన్నారు కేకే మహేందర్ రెడ్డి.  తన ఫోన్ తో పాటు.. మిగతా పార్టీనేతల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు కేకే మహేందర్ రెడ్డి.కేకే మహేందర్ రెడ్డి వెంట..మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. 

ALSO READ : జాబ్​ క్యాలెండర్​పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ ట్వీట్