హైదరాబాద్, వెలుగు: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసిన జేఈఈ మెయిన్ 2026 సెషన్–-1 ఫలితాల్లో కేకేఆర్ గౌతమ్ స్కూల్ పూర్వ విద్యార్థి పి. మోహిత్ దేశంలోనే టాపర్ గా నిలిచారు. 300కు 300 మార్కులతో 100 పర్సంటైల్ సాధించి రికార్డు సృష్టించారు.
ఈ మేరకు సోమవారం స్కూల్ మేనేజ్ మెంట్ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇంతటి ఘన విజయం సాధించిన స్కూల్ విద్యార్థి తమ పాఠశాలలో చదువుకోవడం గర్వకారణంగా ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా స్టూడెంట్కు అభినందనలు తెలిపింది.
