SRH vs KKR: కోల్‌కతాతో సన్ రైజర్స్ తుది పోరు.. టైటిల్ ఎవరిది..?

SRH vs KKR: కోల్‌కతాతో సన్ రైజర్స్ తుది పోరు.. టైటిల్ ఎవరిది..?

ఐపీఎల్ తుది సమరానికి రంగం సిద్ధమైంది. టోర్నీ అంతటా టాప్ ఆటతో ఫైనల్ కు చేరిన సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా  నైట్ రైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదివారం (మే 26) టైటిల్ కోసం పోరాడనున్నాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. సాయంత్రం 7:30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. మొబైల్స్ లో జియో సినిమాలో ఈ మెగా ఫైనల్ చూడొచ్చు. ఫైనల్ ఫైట్ లో ఎవరి బలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 

కోల్‌కతా  నైట్ రైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:

ఐపీఎల్ లో కేకేఆర్ జట్టుకు తిరుగులేకుండా పోతుంది. టోర్నీ తొలి మ్యాచ్ నుంచి క్వాలిఫయర్ వరకు టాప్ ఆట తీరుతో అదరగొట్టింది. పాయింట్ల పట్టికలో 20 పాయింట్లతో ఈ సీజన్ లో టాప్ లో నిలిచింది. క్వాలిఫయర్ 1 లో సన్ రైజర్స్ ను చిత్తు చేసి రాయల్ గా ఫైనల్లోకి అడుగుపెట్టింది. బ్యాటింగ్ లో అందరూ ఫామ్ లో నే ఉన్నారు. ఓపెనర్ నరైన్ తో శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్,రస్సెల్, రమణ్ దీప్ సింగ్, రింకూ సింగ్, నితీష్ రానా ఇలా జట్టు మొత్తం భారీ హిట్టర్లతో నిండిపోయింది. బ్యాటింగ్ ఆర్డర్ డెప్త్ ఉండడం కేకేఆర్ కు కలిసి వచ్చే అంశం. 

బౌలింగ్ లో స్టార్క్ ఫామ్ అందుకోవడం ఆ జట్టుకు కొండంత బలం. హర్షిత్ రానా తన ఫామ్ కొనసాగిస్తుండగా.. స్పిన్నర్లు నరైన్, వరుణ్ చక్రవర్తిలతో బౌలింగ్ బలంగా కనిపిస్తుంది. గంభీర్ కెప్టెన్సీలో 2012, 2014లో టైటిళ్లు నెగ్గి,  2021 రన్నరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచిన కేకేఆర్ నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరింది. పదేండ్ల తర్వాత మూడోసారి ట్రోఫీ అందుకోవాలని కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టుదలగా ఉంది.  లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దశలో ఓసారి.. క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–1లో మరోసారి రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దే పైచేయి అయింది.

సన్ రైజర్స్ హైదరాబాద్:

టోర్నీ అంతటా సన్ రైజర్స్ అసలైన అగ్రెస్సివ్ ఆట తీరుతో దుమ్ములేపింది. మధ్యలో కాస్త తడబడినా చివర్లో గాడిలో పడి టాప్ 2 లో స్థానం సంపాదించింది. బౌలింగ్, బ్యాటింగ్ లో బలంగా కనిపిస్తున్నా.. నిలకడ లేకపోవడం సన్ రైజర్స్ బలహీనత. హెడ్, అభిషేక్ శర్మ మెరుపులు మెరిపిస్తున్నా.. జట్టుకు బరోసా ఇవ్వలేకపోతున్నారు. త్రిపాఠి ఫామ్ లోకి రావడం కలిసివచ్చే అంశం. మార్కరం గాడిలో పడితే సన్ రైజర్స్ కు తిరుగుండదు. ఈ టోర్నీలో ఈ దక్షిణాఫ్రికా కెప్టెన్ దారుణంగా విఫలమయ్యాడు. మిడిల్ ఆర్డర్ లో క్లాసన్ రాణింపుపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. షాబాజ్, కమ్మిన్స్, అబ్దుల్ సమద్ లతో బ్యాటింగ్ డెప్త్ ఉండడం హైదరాబాద్ జట్టుకు కలిసి వచ్చే అంశం. 

లీగ్ లో ఎదురైన రెండు ఓటములకు తుదిపోరులోనే ప్రతీకారం తీర్చుకోవాలని హైదరాబాద్ కసిగా ఉంది. శుక్రవారం ఇదే వేదికపై జరిగిన క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌2లో రాజస్తాన్ ను చిత్తు చేసిన ఉత్సాహంలో ఉన్న రైజర్స్ అదే రిజల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిపీట్ చేసి ఎనిమిదేండ్ల తర్వాత రెండోసారి ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షా అవ్వాలని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోరుకుంటోంది. చివరిసారిగా 2016 లో టైటిల్ గెలిచిన సన్ రైజర్స్ 8 ఏళ్ళ తర్వాత ఆ మరోసారి టైటిల్ గెలిచి మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.   

ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ తో పోలిస్తే కేకేఆర్ అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. ఫైనల్లో ఒత్తిడి జయిస్తే కేకేఆర్ ను మరోసారి విజేతగా చూడొచ్చు.