
భారత టీ20 జట్టులోకి రాహుల్ మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన తర్వాత రాహుల్ ను సెలక్టర్లు పరిశీలించే అవకాశం ఉంది. 2026 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని రాహుల్ ను ఇప్పటి నుంచే పరిగణలోకి తీసుకోనున్నట్టు సెలక్టర్లు ఆలోచిస్తున్నారట. సూర్యకుమార్ యాదవ్ సారధ్యంలో టీమిండియా ఆగస్టు 26న బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. 2026 లో భారత్ వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుండడంతో ఈ సిరీస్ కు భారత క్రికెట్ జట్టు పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఈ వరల్డ్ కప్ కోసం రాహుల్ అనుభవం వాడుకోవాలని సెలక్టర్లు భావిస్తే రాహుల్ కు ఖచ్చితంగా ఛాన్స్ దొరుకుతుంది. ఐపీఎల్ 2025 సీజన్ లో రాహుల్ సూపర్ ఫామ్ తో అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 493 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. దాదాపు 150 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేశాడు. ఆదివారం (మే 18) గుజరాత్ టైటాన్స్ పై 65 బంతుల్లో 14 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 112 నాటౌట్ పరుగులు చేసి టీ20 ఫార్మాట్ లో వేగంగా 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు.
ఓపెనింగ్ తో పాటు ,మిడిల్ ఆర్డర్ లో కూడా రాహుల్ వికెట్ కీపింగ్ చేయగలడు. దీనికి తోడు వికెట్ కీపింగ్ కూడా చేయగల సామర్ధ్యం ఉండడంతో రాహుల్ ఎంపిక ఖాయంగా కనిపిస్తుంది. ఒకవేళ బంగ్లాతో జరగబోయే సిరీస్ కు రాహుల్ ను పరిగణించకపోతే అతని టీ20 కెరీర్ ముగిసినట్టే అని చెప్పుకోవాలి. ఒకవేళ రాహుల్ ను ఎంపిక చేస్తే సంజు శాంసన్ లేదా రిషబ్ పంత్ లలో ఒకరిపై వేటు పడొచ్చు. ప్రస్తుతం జారుతున్న ఐపీఎల్ లో వీరు పేలవ ఫామ్ లో ఉండడంర్ దీనికి కారణం. రాహుల్ చివరిసారిగా 2022టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ పై ఆడాడు.
బంగ్లాదేశ్ తో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఆగస్ట్ 26 న చట్టోగ్రామ్ వేదికగా జరుగుతుంది. ఆగస్టు 29, ఆగస్టు 31 న వరుసగా రెండు, మూడు టీ20 మ్యాచ్ లు జరుగుతాయి.
Reports: KL Rahul in contention for T20I comeback after IPL 2025 heroics.
— CricTracker (@Cricketracker) May 19, 2025
Read it 👉 https://t.co/HEZDuskuG4 pic.twitter.com/wAn1bVpZgK