KL Rahul Unsold: ఐపీఎల్-2026లో అద్భుతమైన ఫామ్‌తో దుమ్మురేపిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు తన సొంత గడ్డపైనే ఊహించని షాక్ తగిలింది. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహారాజా ట్రోఫీ టీ20 లీగ్ మెగా వేలంలో రాహుల్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు.. రూ.2 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన కేఎల్ రాహుల్.. చివరికి అన్‌సోల్డ్ (Unsold) ప్లేయర్‌గా మిగిలిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.
ఎందుకు తీసుకోలేదంటే?:
ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ కేఎల్ రాహుల్‌ను ఏ జట్టూ తీసుకోకపోవడానికి ప్రధాన కారణం అతడు అందుబాటులో ఉండటంపై స్పష్టత లేకపోవడమేనని తెలుస్తోంది. జూన్ నెలలో భారత జట్టు అంతర్జాతీయ మ్యాచ్‌లతో ఫుల్ బిజీగా ఉండబోతుంది. జూన్ 6 నుంచి ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అనంతరం జూన్ 13 నుంచి జరగనున్న వన్డే సిరీస్‌లోనూ ఆడనున్నాడు. అంతేకాదు, జూలై రెండో వారంలో కూడా వన్డే సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు కేఎల్ రాహుల్ వెళ్లనున్నాడు.
ALSO READ : టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో మళ్లీ రచ్చ.
జాతీయ జట్టు బాధ్యతల వల్లే దూరం:
ఇలా వరుసగా అంతర్జాతీయ మ్యాచ్‌లు, జాతీయ జట్టు బాధ్యతలు ఉండటంతోనే ఈ మహారాజా టీ20 లీగ్‌లో కేఎల్ రాహుల్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం లేదు.. అందుకే ఫ్రాంచైజీలు అతనిపై బిడ్ వేయడానికి వెనుకాడుగు వేశాయి. కాగా.. ఈ ప్రతిష్టాత్మక మహారాజా ట్రోఫీ టీ20 లీగ్ మ్యాచ్‌లు మొత్తం హుబ్లీ, మైసూర్, బెంగళూరు నగరాల్లో జరగబోతున్నాయి.
