IND vs AFG Test: భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జూన్ 6 నుంచి చండీగఢ్‌లో జరగబోయే మొదటి టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ కోసం రిషబ్ పంత్‌ను వైస్ కెప్టెన్సీ పదవి నుంచి తొలగించి, ఆ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు అప్పగించడంపై గంభీర్ ఓపెన్ అయ్యాడు. ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌ల్లో కేవలం 312 రన్స్ చేయడమే కాకుండా, సౌతాఫ్రికాతో జరిగిన గత టెస్ట్ సిరీస్‌లో 12.25 యావరేజ్‌తో కేవలం 29 రన్స్ మాత్రమే చేసి పంత్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ ఫామ్ ఎఫెక్ట్ వైస్ కెప్టెన్సీపై పడినట్లు వార్తలపై గంభీర్ స్పందించాడు.
కెప్టెన్సీ అనేది బై ప్రొడక్ట్ మాత్రమే:
రిషబ్ పంత్ వైస్ కెప్టెన్సీ మార్పుపై గంభీర్ మాట్లాడుతూ.. ఆటగాడికి అసలైన బాధ్యత దేశం కోసం ఆడటమే.. కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ అనేవి కేవలం బై ప్రొడక్ట్స్ మాత్రమే.. పంత్ తన సహజసిద్ధమైన ఆటను మార్చుకోవాలని మేము చెప్పం.. కానీ, మ్యాచ్ సిట్యుయేషన్‌ను బట్టి ఆడటం చాలా ముఖ్యం.. పరుగులు చేయడం, వికెట్లు తీయడమే అసలైన టార్గెట్ అని స్పష్టం చేశాడు.
నెంబర్ 3 బ్యాటింగ్ పై క్లారిటీ:
మరోవైపు నంబర్ 3 బ్యాటింగ్ పొజిషన్‌పై కూడా కోచ్ గంభీర్ క్లారిటీ ఇచ్చాడు. దేవదత్ పడిక్కల్ నుంచి గట్టి పోటీ వస్తున్నప్పటికీ, సాయి సుదర్శన్‌కే తాము అండగా ఉంటామని చెప్పాడు. సుదర్శన్‌కు నంబర్ 3లో తగినన్ని అవకాశాలు రాలేదని, ఇంగ్లాండ్‌లో కెరీర్ స్టార్ట్ చేయడం అంత ఈజీ కాదని గంభీర్ గుర్తు చేశాడు. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన సుదర్శన్‌కు లాంగ్ రన్ ఇస్తామని కోచ్ భరోసా ఇచ్చాడు.
WTC ఫైనల్ ఛాన్సులపై గంభీర్ ధీమా:
ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను 2–2తో డ్రా చేసుకోవడం, గత మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో ఇండియా ప్రస్తుతం 6వ స్థానానికి పడిపోయింది. దీనిపై గంభీర్ మాట్లాడుతూ.. మేము ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉంటాం.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరతామనే నమ్మకం ఉంది.. మాకున్న క్వాలిటీ, టాలెంట్‌తో మేము ఫైనల్ గెలవలేకపోవడానికి ఎలాంటి కారణం లేదని ధీమా వ్యక్తం చేశాడు.
