జింబాబ్వే టూర్​కు కెప్టెన్​గా రాహుల్​

జింబాబ్వే టూర్​కు కెప్టెన్​గా రాహుల్​

న్యూఢిల్లీ: జింబాంబ్వేతో మూడు మ్యాచ్‌‌ల వన్డే సిరీస్‌‌కు కేఎల్‌‌ రాహుల్‌‌ కెప్టెన్‌‌గా  ఎంపికయ్యాడు. స్పోర్ట్స్‌‌ హెర్నియా ఆపరేషన్‌‌ నుంచి కోలుకున్న రాహుల్‌‌ పూర్తి ఫిట్‌‌నెస్‌‌తో ఉన్నాడని బీసీసీఐ మెడికల్‌‌ టీమ్‌‌ డిక్లేర్‌‌ చేసింది. దీంతో ముందుగా అనుకున్న శిఖర్‌‌ ధవన్‌‌ ప్లేస్‌‌లో రాహుల్‌‌కు  సెలెక్టర్లు పగ్గాలు అప్పగించారు. ధవన్‌‌కు వైస్‌‌ కెప్టెన్సీ ఇచ్చారు. ఈ నెల18 నుంచి జరిగే ఈ టూర్​కు తొలుత రాహుల్‌‌ను ఎంపిక చేయలేదు. ఫిట్​నెస్​ సాధించడంతో ఇప్పుడు టీమ్​లో చేర్చడంతో పాటు పగ్గాలు కూడా అప్పగించారు. తను వచ్చినప్పటికీ ఎవరినీ తప్పించలేదు. ఓపెనర్‌‌గా రాహుల్‌‌ ప్లేస్‌‌ ఖాయం కాబట్టి రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌ బెంచ్‌‌కే పరిమితం కానున్నాడు.