ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతిపై సమీక్ష

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతిపై సమీక్ష

ఖమ్మం టౌన్, వెలుగు :  సిటీలో ఆయా డివిజన్ లలో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలో ఐదుగురు చొప్పున వార్డు ఆఫీసర్లతో కేఎంసీ కమిషనర్​ అభిషేక్ అగస్త్య సమీక్షించారు. సమీక్షలో వార్డులల వారీగా గ్రౌండింగ్ పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, ఇంకా పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలు, ఆలస్యానికి గల కారణాలు, ఎదురవుతున్న సమస్యలను వార్డ్ ఆఫీసర్లతో చర్చించారు. 

గృహ నిర్మాణ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పట్టాదారులకు తెలియజేయాల్సిన అంశాలపై పలు సూచనలు చేశారు. డివిజన్ వైజ్ గా వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేసి లబ్ధిదారులకు కు ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న గ్రౌండింగ్ పనులను స్పీడప్​ చేయాలన్నారు.