EPFO ​​New Rules: ఇకపై 5 కండిషన్స్ ఫాలో ఐతేనే PF డబ్బులు విత్‌డ్రా కుదురుద్ది..!

EPFO ​​New Rules: ఇకపై 5 కండిషన్స్ ఫాలో ఐతేనే PF డబ్బులు విత్‌డ్రా కుదురుద్ది..!

Withdraw PF Money: ప్రస్తుతం ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న కోట్లాది మంది డబ్బు ప్రావిడెండ్ ఫండ్ ఖాతాల్లో జాగ్రత్త చేయబడుతుందని తెలిసిందే. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగుల ఆర్థిక భరోసా కోసం దీనిని భారత ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ మార్చిన రూల్స్ ప్రకారం 7 కోట్ల మంది సభ్యులు తమ డబ్బును వేగంగా అలాగే సులువుగా విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కల్పించబడింది. కానీ అది జరగాలంటే 5 ముఖ్యమైన నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. 

1. ముందుగా ఈపీఎఫ్ఓ సభ్యుల యూఏఎన్ నంబర్, అలాగే దానికి లింక్ చేయబడిన మెుబైల్ నంబర్ పనిచేస్తూ ఉండాలి. ఎందుకంటే పిఎఫ్ విత్ డ్రా సమయంలో ఓటీపీలు సదరు ఫోన్ నంబరుకే వస్తాయి వెరిఫికేషన్ ప్రక్రియ కోసం.

2. అసలు డబ్బు విత్ డ్రా కోసం అత్యంత ముఖ్యమైనది మీ పీఎఫ్ ఖాతాకు ఆధార్ కార్డును లింక్ చేయటం. డబ్బు డ్రా కోసం ప్రయత్నించినప్పుడు ఈకేవైసీ ప్రక్రియ ఆధార్ ద్వారా నిర్వహించబడినప్పుడు సదరు ఓటీపీలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 

3. పీఎఫ్ డబ్బు కోసం విత్ డ్రా రిక్వెస్ట్ పెట్టడానికి ముందుగా మీరు ఏ బ్యాంక్ ఖాతాలోకి ఆ మెుత్తం కావాలనుకుంటున్నారో దానిని లింక్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ పేరు పై ఉన్న బ్యాంక్ ఖాతా దాని ఐఎఫ్ఎస్సీ కోడ్ వంటి వివరాలు ఎలాంటి తప్పులు లేకుండా అందించాల్సి ఉంటుంది. 

4. మీరు ఐదేళ్ల కంటే తక్కువ ఉద్యోగ సర్వీస్ కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ పాన్ వివరాలను ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 

5. ఇక చివరిగా మీరు ఉద్యోగంలో చేరిన తేదీకి సంబంధించిన వివరాలు ఖచ్చితంగా ఈపీఎఫ్ఓ అధికారిక రికార్డుల్లో పొందుపరచబడి ఉండాలి. 

పైన పేర్కొన్న నిబంధనలన్నీ పాటిస్తేనే మీరు పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా కోసం ప్రయత్నం చేసేందుకు వీలు కల్పించబడుంది. సహజంగా ఈ మెుత్తాన్ని ఇల్లు కొనుక్కోవటం లేదా కట్టుకోవటానికి, కంపెనీ మూసివేత, ఏదైనా అనారోగ్య సమస్యలకు, వివాహానికి, పిల్లల చదువు వంటి అవసరాల కోసం వెనక్కి తీసుకోవచ్చు. ఈ ప్రక్రియ మెుత్తాన్ని పీఎఫ్ అధికారిక వెబ్ సైట్ నుంచి పూర్తి చేసుకోవటం సురక్షితం.