2025లో డబ్బుల వర్షం కురిపించిన 3 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్.. మీకూ SIP పెట్టుబడులున్నాయా?

2025లో డబ్బుల వర్షం కురిపించిన 3 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్..  మీకూ SIP పెట్టుబడులున్నాయా?

Mutual Funds: గడచిన రెండేళ్లుగా ఈక్విటీ మార్కెట్లతో పాటు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్న రిటైల్ పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వాస్తవానికి పెట్టుబడి సాధనాలపై అవగాహన పెరగటంతో పాటు తక్కువ రిస్క్ తీసుకోవాలనుకుంటున్న వ్యక్తులు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ ఉత్తమ పెట్టుబడి ఎంపికగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. 

వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు కరెక్షన్ మోడ్ లోకి జారుకోవటంతో చాలా మంది పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను నిలిపివేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. స్టాక్ పతనంతో అనేక ఫండ్స్ నష్టాల్లోకి పోర్ట్ ఫోలియోలను నెట్టినప్పటికీ 70 శాతం ఫండ్ మేనేజర్లు మాత్రం లాభాలను అందించగలిగారు. బెంచ్ మార్క్ సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్ తో పాటు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీల్లో కనిపించిన బేర్స్ జోరు కొంత ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే. 

ఇదే సమయంలో అమెరికా టారిఫ్స్, ఆశించి స్థాయిలో లేని కార్పొరేట్ ఫలితాలు, ఇండియా పాక్ యుద్ధం సహా మరిన్ని ప్రపంచ కారకాలు భారతీయ మార్కెట్లను ఒడిదొడుకులకు గురయ్యేలా చేశాయి. వాస్తవానికి మెుత్తం 1800 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉండగా.. 2025లో మే 28 వరకు వెయ్యి 162 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ తమ పెట్టుబడిదారులకు లాభాలను అందించటం కొనసాగిస్తున్నాయని డేటా చెబుతోంది. 

టాప్ రాబడులిచ్చిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్..
ముందుగా 2025లో పెట్టుబడిదారులకు 30 శాతానికి పైగా రాబడులను అందించి అదరగొట్టాయి డిఫెన్స్ మ్యూచువల్ ఫండ్స్, ఇక గోల్డ్ ఫండ్స్ రెండవ స్థానంలో కొనసాగుతూ 25 శాతం వరకు రాబడిని తెచ్చిపెట్టాయి. ఇక సిల్వర్ ఫండ్స్ మూడో స్థానంలో 12 శాతం వరకు రాబడిని అందించగా.. నాల్గవ స్థానంలో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ ఫండ్స్ 8 శాతానికి పైగా రాబడిని ఇచ్చాయి. ఇక టాప్-5 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కింద బ్యాంకింగ్ ఫండ్స్ నిలిచి ఉత్తమ రాబడులను డెలివరీ చేశాయి.