వచ్చే మార్చిలోపు 300 బ్రాంచ్‎లు.. ఆదిత్య బిర్లా క్యాపిటల్ ప్రకటన 

వచ్చే మార్చిలోపు 300 బ్రాంచ్‎లు.. ఆదిత్య బిర్లా క్యాపిటల్ ప్రకటన 

హైదరాబాద్, వెలుగు: ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ (ఏబీసీఎల్​) తన ఎన్‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ వ్యాపారాన్ని గోల్డ్ లోన్ రంగంలోకి విస్తరించింది. దీనిని భారీగా విస్తరించాలని నిర్ణయించింది. 2027 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 200 నుంచి 300 ప్రత్యేక గోల్డ్ లోన్ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యమని సీఈఓ రాకేష్ సింగ్ తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ​శంషాబాద్‌‌‌‌‌‌‌‌లో మొదటి ప్రత్యేక గోల్డ్ లోన్ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌ను శనివారం ప్రారంభించామని చెప్పారు.  2026 మార్చి నాటికి తెలంగాణలో రూ.1.61 లక్షల కోట్ల గోల్డ్ లోన్ పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియోతో 70.5 శాతం వృద్ధి నమోదైందని ఆయన వివరించారు.