బీడీఎస్ మొదటి విడత సీట్లకేటాయింపు లిస్ట్ రిలీజ్

బీడీఎస్ మొదటి విడత సీట్లకేటాయింపు లిస్ట్ రిలీజ్
  • మేనేజ్​మెంట్ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ వెబ్ ఆప్షన్లకు అవకాశం 

హైదరాబాద్, వెలుగు: కాంపిటెంట్ అథారిటీ కోటా కింద బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ(బీడీఎస్) కోర్సులో ప్రవేశాల కోసం మొదటి విడత కౌన్సెలింగ్ కు సంబంధించిన సీట్ల కేటాయింపు లిస్టును కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ( కేఎన్ఆర్ యూ హెచ్ఎస్) సోమవారం విడుదల చేసింది. ఈ లిస్టులో సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 25 తేదీ సాయంత్రం 4 గంటల లోపు తమకు కేటాయించిన కాలేజీల్లో తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని యూనివర్సిటీ సూచించింది. 

మెనేజ్ మెంట్ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ వెబ్ కౌన్సెలింగ్ కు నోటిఫికేషన్... 

ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ కోటా (బీ అండ్ సీ, ఎన్ఆర్ఐ కేటగిరీ) కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో ప్రవేశాల కోసం మొదటి దశ వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ ను కేఎన్ఆర్ యూ హెచ్ఎస్ సోమవారం విడుదల చేసింది. సెప్టెంబర్ 20న విడుదల చేసిన ఫైనల్ మెరిట్ లిస్ట్ లో అర్హత సాధించిన విద్యార్థులు సెప్టెంబర్ 22 మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సెప్టెంబర్ 24 మధ్యాహ్నం 2 గంటల వరకు https://tspvtmedadm.tsche.in/ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ ద్వారా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ సూచించింది. ఫస్ట్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోని విద్యార్థులు, సీటు కేటాయించిన తర్వాత కాలేజీల్లో జాయిన్ కాకపోతే తదుపరి రౌండ్లకు అర్హత కోల్పోతారని యూనివర్సిటీ స్పష్టం చేసింది.