కొడాలి నానీకి క్యాన్సర్ లేదు.. ఆరోగ్యంగానే ఉన్నారు

కొడాలి నానీకి క్యాన్సర్ లేదు.. ఆరోగ్యంగానే ఉన్నారు

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేతలపై తనదైన స్టైల్లో విరుచుకుపడే వైసీపీ నేతల్లో కొడాలి నాని స్టైలే వేరు.. అందుకే ఆయనను ఫైర్ బ్రాండ్ అంటారు. అసెంబ్లీ, బహింరంగ సభలు, ప్రెస్ మీట్స్.. ప్లేస్ ఎక్కడైనా.. వేదిక ఏదైనా తనదైన మాటలతో ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడుతుంటారు. తాజాగా కొడాలి నాని అపోలో ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారని.. ఆయన క్యాన్సర్ బారిన పడ్డారని గత రెండు రోజులుగా ( వార్త రాసే రోజుకు)  పలు మీడియాలలో ప్రచారం జరిగింది. తాజాగా మీడియాలో వస్తున్న రూమర్స్ పై కొడాలి నాని స్పందించారు.  

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.. తనకు క్యాన్సర్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనను దైర్యంగా ఎన్నికలలో ఎదుర్కోలేక, తప్పుడు రాతలు రాస్తూ, తప్పుడు కథనాల ద్వారా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని ఈ మేరకు ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. రెండు రోజులుగా తాను ఏయే కార్యక్రమాలలో పాల్గొన్నారో వివరంగా తెలియజేశారు.

  కొడాలి నాని ఎటువంటి హాస్పిటల్స్ లో జాయిన్ అవ్వలేదంటూ .. గత వారం రోజులుగా గుడివాడలోనే ఉంటు ప్రజల సమస్యలు తెలుసుకొని  వాటిని పరిష్కరించారని తెలిపారు.  ఆదివారం (జులై 9)  బాబ్జి గారి జయంతి కార్యక్రమాల్లో  మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు.   కొండలమ్మ వారికి ఆషాడ సారే అందించారు.  విదేశాల నుండి  కుటుంబ సభ్యులు వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకునే క్రమంలో  హైదరాబాద్ వెళ్ళారు.  ప్రస్తుతం విజయవాడలో ఆయన వ్యక్తిగత కార్యక్రమంలో ఉన్నారని.. ఈరోజు ( జులై 11) గుడివాడ వచ్చి  ఎప్పటిలానే ప్రజల సమస్యల పై అందుబాటులో ఉంటారని ఆయన అనుచరులు క్లారిటీ ఇచ్చారు. 

ఉపయోగం లేని అబద్దపు వార్తలను నాని ఖండించారు. త్వరలో ఎన్నికలు వస్తున్నాయని, పదవుల కోసమే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే నానితో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సునకానందం కోసం కొందరు తనకు అనారోగ్యం అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కొడాలి నాని.. నేను అనారోగ్యానికి గురైనట్టు సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని కొట్టిపారేశారు.. టీడీపీ దిగజారుడు తనానికి ఇది నిదర్శనం, నాకు క్యాన్సర్‌ అంటూ ఐ-టీడీపీ ద్వారా టీడీపీ ఇలాంటి ప్రచారాలు చేయిస్తోందని దుయ్యబట్టారు. నాకు ఎలాంటి క్యాన్సర్‌ లేదని స్పష్టం చేశారు. ఇక, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుని మానసిక వైకల్య కేంద్రంలో చేర్చాలని సీఎం వైఎస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేశారు కొడాలి నాని.. 2024 ఎన్నికలు అయిన తర్వాత వీళ్లకి మానసిక వైకల్య కేంద్రంలో చేరుస్తామన్న ఆయన.. దమ్ముంటే నాపై పోటీకి దిగాలని చంద్రబాబు, లోకేష్ కు సవాలు చేసినా స్పందించటం లేదన్నారు. చంద్రబాబుకి రాజకీయాల నుంచి చరమ గీతం పలికే వరకు నేను భూమి మీదే ఉంటా.. ఇలాంటి సోషల్ మీడియా ప్రచారాల వల్ల నాకేం కాదన్నారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.