జైల్లో దోమలు కుట్టక .. రంభ, ఊర్వశి వచ్చి కన్నుకొడతాయా..? చంద్రబాబుపై కొడాలి సెటైర్లు..

జైల్లో దోమలు కుట్టక .. రంభ, ఊర్వశి వచ్చి కన్నుకొడతాయా..? చంద్రబాబుపై కొడాలి సెటైర్లు..

రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు దోమలు కుడుతున్నాయంటూ  నారా భువనేశ్వరి చేసిన  వ్యాఖ్యలపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు.  జైల్లో దోమలు కాకుండా రంభా, ఉర్వశి, మేనకలు వచ్చి చంద్రబాబుకు కన్నుకొడతాయా అంటూ సైటైర్లు వేశారు.  చంద్రబాబు గతంలో దోమలపై దండయాత్ర చేశారని... అవే పగ తీర్చుకుంటున్నాయేమో అని పంచులు వేశారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఎవరికైనా జైలులో ఒకే ట్రీట్ మెంట్ ఉంటుందని తెలిపారు.  అయితే  తనకు ఆరోగ్యం బాగాలేదనో....మరో ఇతర  సమస్య ఉందని కోర్టుకు విన్నవించుకుంటే అందుకు తగినట్టుగా న్యాయస్థానం కొన్ని వసతులు కల్పించే అవకాశం ఉందని చెప్పారు. అలా కోర్టు చెప్పిన సౌకర్యాలే జైల్లో ఉంటాయని కొడాలి నాని స్పష్టం చేశారు. 

చంద్రబాబుకు బెయిల్ వస్తుందా రాదా అంటూ టిడిపి కార్యకర్తలు నానా రచ్చ చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. జైలుకు వెళ్లిన వారి బెయిల్ రాకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. జైలుకు వెళ్లిన ప్రతీ ఒక్కరికి బెయిల్ వస్తుందని చెప్పారు. మరి చంద్రబాబు జైలుకు వెళ్లకుండా.. ప్రియా పచ్చళ్ల కోసం మామిడి కాయలు కొట్టేందుకు వెళ్లాడా అంటూ మరోసారి సెటైర్లు వేశారు. 

Also Read :- ఆరు నెలల్లో సీఎం జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా : లోకేష్

లోకేష్‌  తమ పేర్లను రెడ్‌బుక్‌లో రాస్తున్నాడని.. తాము మాత్రం లోకేష్‌ పేరు చిత్తు కాగితాల్లో కూడా రాయమని కొడాలి నాని ఎద్దేవా చేశారు.  ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవి అని చెప్పిన లోకేష్‌.... తన తండ్రి జైలుకెళ్తే ఎందుకు ఏడుస్తున్నాడని చురకలంటించారు.  చంద్రబాబుకు పెద్ద పదవి వద్దా అంటూ అవహేళన చేశారు.  బాబు అరెస్ట్‌తో లోకేష్‌ తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూశాడని విమర్శించారు.  కొట్టండి, జైల్లో పెట్టండి, నిరూపించడండి అన్న లోకేష్‌.... ఇప్పుడు బెయిల్‌ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడని దుయ్యబట్టారు.