పోడు భూముల సమస్య పరిష్కారం జరిగేనా?: కోదండరామ్

పోడు భూముల సమస్య పరిష్కారం జరిగేనా?: కోదండరామ్

ప్రజా సమస్యలు పరిష్కరించేలా రాజకీయాలు చేయాలన్నారు ప్రొఫెసర్ కోదండరామ్.  కాని బీఆర్ఎస్ ప్రత్యర్థుల్ని చీల్చి .. ప్రజల సొమ్మును కొల్లగొట్టే విధంగా రాజకీయం చేస్తుందని ఆయన విమర్శించారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అందరి దగ్గర దరఖాస్తులు తీసుకొని సర్వే చేసి నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు ఎవరికీ పట్టాలివ్వకుండా ప్రజలను మభ్య పెడుతుందని ఆరోపించారు.   అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 11 వేల రూపాయిలు  నష్టపరిహారం ఇస్తామని ప్రకటించి .. పైసలు ఇవ్వనిదే మంజూరు చేయడం లేదన్నారు.  రైతు ప్రభుత్వమని చెప్పుకొనే కేసీఆర్... రైతులను ఎప్పుడు ఆదుకుంటారని కోదండరామ్ ప్రశ్నించారు.  

పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా  .. తరుగు పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను దోచుకుంటుందని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆర్థిక బాధలు తట్టు్కోలేక రైతులు తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రజలను చైతన్య పరిచేందుకే యాత్ర చేస్తు్న్నామని కోదండరామ్ అన్నారు.  ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.