ఫార్మాసిటీపై బీజేపీ, బీఆర్​ఎస్​వి అబద్ధాలు : కోదండ రెడ్డి

ఫార్మాసిటీపై బీజేపీ, బీఆర్​ఎస్​వి అబద్ధాలు : కోదండ రెడ్డి

హైదరాబాద్, వెలుగు :  ఫార్మా సిటీపై బీజేపీ, బీఆర్​ఎస్​ కలిసి కాంగ్రెస్​ ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలు పూర్తి అబద్ధాలని కిసాన్​ కాంగ్రెస్​ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఎక్కువ సీట్లు రాకపోవడంతో బిత్తరపోయి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నాని తెలిపారు. శుక్రవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. 

‘‘హైదరాబాద్​ గ్రీన్​ సిటీ,  ఫార్మా సిటీ పేరుతో రైతుల దగ్గర బీఆర్​ఎస్​ ప్రభుత్వం రూ.7 లక్షలకు భూములు కొని ఎక్కువ రేట్లకు అమ్ముకున్నది. ఫార్మా సిటీతో ప్రజలు, వన్యప్రాణులకు ఇబ్బంది కలుగుతుందని కాంగ్రెస్​ ముందు నుంచీ చెప్తున్నది. అందువల్ల ఫార్మా సిటీని ఒక్క దగ్గర కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో పెడతామని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఫార్మా సిటీపై ప్రజాభిప్రాయం మేరకు కాంగ్రెస్​ పార్టీ ముందుకు సాగుతుంది’’ అని పేర్కొన్నారు.