
భూ ప్రక్షాళనతో రైతులు రోడ్డున పడ్డారన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. కొత్త రెవిన్యూ చట్టంపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత సెలక్ట్ కమిటీకి పంపాలన్నారు. సమగ్ర చర్చల తర్వాతే రెవిన్యూ చట్టాలలో మార్పులు చేయాలని అనే అంశంపై సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. భూ రికార్డుల ప్రక్షాళన చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఆల్ ఇండియా కిసాల్ సెల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి. వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తామనడం సమంజసం కాదన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన పూర్తైన తర్వాతే రెవిన్యూ చట్టాన్ని ఆమోదించాలన్నారు సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని సూచించారు.