
హైదరాబాద్, వెలుగు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో మాజీ ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ భేటీ అయ్యారు. గురువారం హైదరాబాద్ లో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యల పరిష్కారం, ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టుల భర్తీ, జాబ్ క్యాలెండర్ అమలు వంటి విషయాలపై ఈ మీటింగ్ లో చర్చించారు.
నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి స్పష్టం చేసినట్టు తెలిసింది. బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారాన్ని నిరుద్యోగులు నమ్మవద్దని, ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి తీరుతుందని కోదండరాం, అద్దంకి దయాకర్ కు పొంగులేటి, వేం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.