
- కేంద్రం చెప్తున్నా వినలేదు
- పోలవరం పూర్తయితే భద్రాద్రి పవర్ ప్లాంట్ మునుగుతుంది
- జనసమితి అధ్యక్షుడు కోదండరాం
హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ అభివృద్ధి పేరుతో నిబంధనలను ఉల్లంఘించిందని తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా కేసీఆర్ తొందర పాటు నిర్ణయం వల్ల ఛత్తీస్ గడ్ ఒప్పందాలు చేసుకున్నారని అన్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారని చెప్పారు.
పోలవరం పూర్తి అయితే భద్రాద్రి పవర్ ప్లాంట్ మునుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయలేదన్నారు. కేసీఆర్ అనుసరిస్తున్న పద్ధతి కరెక్ట్ కాదని, ఇప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆర్థిక పరమైన అంశాల్లో కేసీఆర్ కొద్ది మందికే లాభం చేకూరే విధంగా నిర్ణయాలు ఉన్నాయన్నారు.