మహబూబ్‌నగర్ టౌన్(జడ్చర్ల), వెలుగు: రెండు రోజులుగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్ లాకప్‌లో ఓ కోడి పుంజు బందీ అయింది. పోలీసులే దానికి తిండి పెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జడ్చర్ల మండలం బూరెడ్డిపల్లిశారులో తరచుగా నాటు కోళ్ల దొంగతనాలు జరుగుతున్నాయి.
ఇటీవల కర్వెన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కోళ్లు దొంగతనం చేస్తుండగా, గ్రామస్తులు పట్టుకున్నారు. అతనితోపాటు ఓ కోడిపుంజును పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆ వ్యక్తిని, కోడి పుంజును లాకప్‌లో వేసి విచారణ చేపడుతున్నారు. స్టేషన్‌కు వచ్చిపోయేవారు లాకప్‌లోని కోడి పుంజును చూసి ఆశ్చర్యపోతున్నారు. కోడిని కూడా లోపల వేస్తారా అని చర్చించుకుంటున్నారు.
