టీమ్ ఎంపికపై కోహ్లీ పునరాలోచన

టీమ్ ఎంపికపై కోహ్లీ పునరాలోచన
  • టీమ్‌‌ కాంబినేషన్‌‌పై కోహ్లీ పునరాలోచన
  • బౌలింగ్‌‌ లైనప్‌‌లో మార్పులు!
  • అక్షర్‌‌ ఫిట్‌‌.. నదీమ్‌‌పై వేటు పడే చాన్స్‌‌
  • శనివారం నుంచి ఇంగ్లండ్‌‌తో సెకండ్‌‌ టెస్ట్‌‌

ఫ్లాట్‌‌‌‌ పిచ్‌‌‌‌ను ఎంచుకోవడం.. టాస్‌‌‌‌ కోల్పోవడం.. ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో ప్రత్యర్థికి భారీ స్కోరు ఇచ్చుకోవడం.. యంగ్‌‌‌‌ స్పిన్నర్లు తేలిపోవడం.. ఓపెనర్‌‌‌‌ రోహిత్‌‌‌‌, రహానె రెండు ఇన్నింగ్స్‌‌‌‌ల్లోనూ ఫెయిలవడం.. ఇలా చెప్పుకుంటూపోతే ఇంగ్లండ్‌‌‌‌తో తొలి టెస్టులో ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయి..! యంగ్‌‌‌‌స్టర్లతో కూడిన టీమ్‌‌‌‌తో.. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై చిత్తు చేసొచ్చిన ఇండియా నుంచి హోమ్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌లో ఇలాంటి చెత్త పెర్ఫామెన్స్‌‌‌‌ ఊహించలేదు..! ఇప్పుడు ఇంకో టెస్టులో ఓడితే సిరీసే కాదు.. వరల్డ్‌‌‌‌ టెస్టు చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ బెర్తును కూడా కోహ్లీసేన కోల్పోతుంది..! దాంతో, సెకండ్‌‌‌‌ టెస్టులో ఇంగ్లిష్‌‌‌‌ టీమ్‌‌‌‌పై రివెంజ్‌‌‌‌ తీర్చుకొని సిరీస్‌‌‌‌లో నిలవడంపై హోమ్‌‌‌‌టీమ్‌‌‌‌ కన్నేసింది..!  అందుకోసం టీమ్‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌లో మార్పులకు ఉపక్రమించింది..! నదీమ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో గాయం నుంచి కోలుకున్న అక్షర్‌‌‌‌ను తీసుకోవాలని చూస్తోంది..! అవసరమైతే ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ హార్దిక్‌‌‌‌ పాండ్యాను కూడా బరిలోకి దింపే ఆలోచన చేస్తోంది..! అలాగే, తొలి రోజు నుంచే స్పిన్‌‌‌‌కు అనుకూలించే వికెట్‌‌‌‌ను రెడీ చేయిస్తోంది..!

చెన్నై: దాదాపు ఏడాది బ్రేక్‌‌‌‌ అనంతరం సొంతగడ్డపై బరిలోకి దిగిన టీమిండియా ఇంటర్నేషనల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ను భారీ ఓటమితో రీస్టార్ట్‌‌‌‌ చేసింది. నాలుగు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో భాగంగా  ఇంగ్లండ్‌‌‌‌తో జరిగిన ఫస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో చిత్తుగా ఓడింది.  ఆస్ట్రేలియాపై సాధించిన విక్టరీతో ఫుల్‌‌‌‌ కాన్ఫిడెన్స్‌‌‌‌లో ఉన్న ఇండియాకు జో రూట్‌‌‌‌ అండ్‌‌‌‌ టీమ్‌‌‌‌ పెద్ద షాకే ఇచ్చింది. చిదంబరం స్టేడియంలో ఫ్లాట్‌‌‌‌ వికెట్‌‌‌‌పై జరిగిన ఆ మ్యాచ్‌‌‌‌లో టాస్‌‌‌‌ కూడా కీరోల్‌‌‌‌ పోషించింది. శనివారం ఇరుజట్ల మధ్య మళ్లీ చెపాక్‌‌‌‌ స్టేడియంలోనే రెండో టెస్ట్‌‌‌‌ ప్రారంభం కానుంది. అయితే, భారీ ఓటమి అనంతరం జరిగే ఈ మ్యాచ్‌‌‌‌కు ఇండియా ఎలాంటి కాంబినేషన్‌‌‌‌తో బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ముగ్గురు స్పిన్నర్ల ప్లాన్‌‌‌‌ను కొసాగిస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఫస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ ఓటమి అనంతరం టీమిండియా ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌పై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌ను కాదని షాబాజ్‌‌‌‌ నదీమ్‌‌‌‌కు చాన్స్‌‌‌‌ ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు ఎదురయ్యాయి. నదీమ్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌ను సమర్ధించుకున్న కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌.. కాంబినేషన్స్‌‌‌‌ విషయంలో  తమకు పూర్తి అవగాహన ఉందన్నాడు. అదే సమయంలో ఓటమికి సాకులు చెప్పమని, చేసిన తప్పులను మాత్రం సరిచేసుకుంటామని అన్నాడు. విరాట్‌‌‌‌ తమ నిర్ణయాలను ఎంత సమర్థించుకున్నప్పటికీ.. ఫస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో కుల్దీప్‌‌‌‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. సీనియర్‌‌‌‌ రవిచంద్రన్‌‌‌‌ అశ్విన్‌‌‌‌తో కలిసి బరిలోకి దిగిన యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌ షాబాజ్‌‌‌‌ నదీమ్‌‌‌‌, వాషింగ్టన్‌‌‌‌ సుందర్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో తేలిపోయారు. ఈ నేపథ్యంలో సెకండ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌కు జట్టులో పలు మార్పులు జరిగే అవకాశం క్లియర్‌‌‌‌గా కనిపిస్తోంది. ఫస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌  రెండు ఇన్నింగ్స్‌‌‌‌లు కలిపి 59 ఓవర్లు వేసిన నదీమ్‌‌‌‌ 233 రన్స్‌‌‌‌ ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఓవర్‌‌‌‌కు నాలుగు రన్స్‌‌‌‌ ఇచ్చుకున్నాడు. టెస్ట్‌‌‌‌ల్లో దీన్ని అట్టర్‌‌‌‌ ఫ్లాప్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ అనొచ్చు. దీనికితోడు ఫ్రంట్‌‌‌‌ ఫుట్‌‌‌‌ నోబాల్స్‌‌‌‌ ఎక్కువగా వేసిన నదీమ్‌‌‌‌..తన బౌలింగ్‌‌‌‌ యాక్షన్‌‌‌‌లో చిన్న సమస్య ఉందని స్వయంగా ఒప్పుకున్నాడు. బాల్‌‌‌‌ వేసే ముందు చేసే జంప్‌‌‌‌ టైమింగ్‌‌‌‌లో తేడా ఉన్నట్లు గుర్తించానన్నాడు. కోచ్‌‌‌‌లతో కలిసి నెట్స్‌‌‌‌లో ఈ సమస్యపై వర్క్‌‌‌‌ చేస్తానని కూడా చెప్పాడు. దీంతో ఈ జార్ఖండ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ను సెకండ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌కు పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, నదీమ్‌‌‌‌కు రీప్లేస్‌‌‌‌మెంట్‌‌‌‌ ఎవరనేది తేలాల్సి ఉంది. ఈ ప్లేస్‌‌‌‌ కోసం కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ రేస్‌‌‌‌లో ఉన్నారు. ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ అయిన అక్షర్‌‌‌‌.. మోకాలి నొప్పితో ఫస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌కు అందుబాటులో లేడు. కానీ ఇంజ్యురీ నుంచి రికవర్‌‌‌‌ అయిన అక్షర్‌‌‌‌ ప్రస్తుతం మ్యాచ్‌‌‌‌ ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ సాధించాడు. నెట్స్‌‌‌‌లో పూర్తి స్థాయిలో ప్రాక్టీస్‌‌‌‌ చేస్తూ చాన్స్‌‌‌‌ కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే, కంప్లీట్‌‌‌‌ బౌలర్‌‌‌‌ అయిన కుల్దీప్‌‌‌‌, ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ అక్షర్‌‌‌‌లో మేనేజ్‌‌‌‌మెంట్ ఎవరికి ఓటేస్తోందో చూడాలి. నిజానికి ఫిట్‌‌‌‌గా ఉండుంటే అక్షర్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లోనే బరిలోకి దిగేవాడని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్‌‌‌‌ అధికారి  అన్నారు. ‘మోకాలిలో ఉన్న చిన్న ఇబ్బంది నుంచి అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ రికవర్‌‌‌‌ అయ్యాడు. నెట్స్‌‌‌‌లో ఆల్రెడీ బ్యాటింగ్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేశాడు. ఒకట్రెండు రోజుల్లో బౌలింగ్‌‌‌‌ కూడా మొదలుపెడతాడు. నిజానికి ఫస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో అక్షర్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ చాయిస్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌. కానీ కెప్టెన్‌‌‌‌ కోహ్లీ, హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ రవిశాస్త్రి, బౌలింగ్‌‌‌‌ కోచ్‌‌‌‌ భరత్‌‌‌‌ అరుణ్‌‌‌‌ ఆలోచన ఏంటో తెలియదు. వాళ్లపైనే సెలెక్షన్‌‌‌‌ ఆధారపడి ఉంటుంది’ అని ఆ అధికారి పేర్కొన్నారు. ఇక, మరో యంగ్‌‌‌‌స్టర్‌‌‌‌ వాషింగ్టన్‌‌‌‌ సుందర్‌‌‌‌ ప్లేస్‌‌‌‌కు ఢోకా లేదనిపిస్తోంది. బౌలర్‌‌‌‌గా ప్రభావం చూపలేకపోయిన సుందర్‌‌‌‌.. బ్యాటింగ్‌‌‌‌లో మెరవడం అతనికి కలిసొచ్చే అంశం. అయితే, మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు ప్లాన్‌‌‌‌కి వెళ్లినా..  హార్దిక్‌‌‌‌ పాండ్యాకు చాన్స్‌‌‌‌ ఇవ్వాలని భావించినా జట్టు కూర్పు పూర్తిగా మారిపోతుంది.

అశ్విన్‌‌‌‌ సేఫ్‌‌‌‌ అండ్‌‌‌‌ రెడీ..

ఫస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ సెకండ్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌ చేస్తుండగా గాయపడిన టీమిండియా సీనియర్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ రవిచంద్రన్‌‌‌‌ అశ్విన్‌‌‌‌ ఫిట్‌‌‌‌గా ఉన్నట్లు తెలుస్తోంది. జోఫ్రా ఆర్చర్‌‌‌‌ వేసిన షార్ట్‌‌‌‌ బాల్‌‌‌‌ అశ్విన్‌‌‌‌ భుజానికి బలంగా తాకింది. నొప్పితో విలవిల్లాడిన అశ్విన్‌‌‌‌కు ఫిజియో నితిన్‌‌‌‌ పటేల్‌‌‌‌ వెంటనే ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇచ్చారు. కానీ, ఆ ఇంజ్యురీ తీవ్రమైతే పరిస్థితేంటి అనే ఆందోళన కలిగింది. అయితే, అశ్విన్‌‌‌‌కు తగిలిన దెబ్బ తీవ్రమైంది కాదని, ముందస్తు స్కానింగ్స్‌‌‌‌ కూడా అవసరం లేదని జట్టు వర్గాలు చెబుతున్నాయి. సెకండ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ ముందు టీమిండియాకు ఇది గుడ్‌‌‌‌న్యూస్‌‌‌‌ అనే చెప్పొచ్చు.

ఫస్ట్‌‌‌‌ డే నుంచే టర్న్‌‌‌‌?

సెకండ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌కు టీమిండియా ఫ్రెండ్లీ వికెట్‌‌‌‌ ఆశిస్తోంది. ఫస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌కు పూర్తిగా ఫ్లాట్‌‌‌‌ వికెట్‌‌‌‌ ఇచ్చిన తమిళనాడు క్రికెట్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇందుకోసం బీసీసీఐ హెడ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ పిచ్స్‌‌‌‌ అండ్‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌ కమిటీ చీఫ్‌‌‌‌ తపోష్‌‌‌‌ చటర్జీతో కలిసి టీఎన్‌‌‌‌సీఏ క్యురేటర్‌‌‌‌ వి.రమేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ పని చేస్తున్నారు. స్పోర్టివ్‌‌‌‌ వికెట్‌‌‌‌ తయారు చేసి టాస్‌‌‌‌కు ప్రాధాన్యం తగ్గించాలని చూస్తున్నారు. ఫస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ ఆడిన పిచ్‌‌‌‌ పక్కనే ఉన్న  గ్రీన్‌‌‌‌ వికెట్‌‌‌‌పై సెకండ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ ఆడించాలని భావిస్తున్నారు. ఈ వికెట్‌‌‌‌పై మంచి టర్న్‌‌‌‌ లభిస్తుందని ఆశిస్తున్నారు.  అయితే, మ్యాచ్‌‌‌‌ ప్రారంభమయ్యే లోపు దీనిపై వాటరింగ్‌‌‌‌ చేయడం ఆపుతారో లేదో  చూడాలి. ఒకవేళ పూర్తిగా డ్రై వికెట్‌‌‌‌ను అందిస్తే.. ఎండ వల్ల మ్యాచ్‌‌‌‌ మధ్యలో పిచ్‌‌‌‌పై పగుళ్లు వస్తాయి. అలాగే, ఫస్ట్‌‌‌‌ డే నుంచి టర్న్‌‌‌‌ లభించే వికెట్‌‌‌‌ను ఎంచుకుంటే విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఫారిన్‌‌‌‌లో చాలా టీమ్స్‌‌‌‌ పేస్‌‌‌‌కు అనుకూలించే గ్రీన్‌‌‌‌ వికెట్లను ఎంచుకున్నప్పుడు లేని సమస్య ఇండియాలో ఫస్ట్‌‌‌‌ డే నుంచి టర్న్‌‌‌‌ లభించే పిచ్‌‌‌‌లపై ఆడించినప్పుడు ప్రశ్నించడం ఎందుకన్న వాదన ఇండియన్‌‌‌‌ సర్కిల్స్‌‌‌‌లో ఎప్పటి నుంచో ఉంది. న్యూజిలాండ్‌‌‌‌లోని  క్ట్రైస్ట్‌‌‌‌చర్చ్‌‌‌‌ లాంటి ప్రాంతాల్లో  దూరం నుంచి చూస్తే  ఔట్‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌ ఏదో,  పిచ్‌‌‌‌ ఏదో తేల్చుకోవడం కష్టం.  మరి, సెకండ్‌‌‌‌ టెస్టు కోసం మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఎలా ముందుకెళ్తుందో చూడాలి.

For More News..

రూ. 5 లక్షల కోట్లు దాటిన ఎస్‌బీఐ హోమ్‌ లోన్ బిజినెస్‌

ఇండియా ఫుట్‌బాల్‌ టీమ్‌లో తెలంగాణ యువతి

త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ షెడ్యూల్!