ఐపీఎల్ 2022 బెస్ట్ టీమ్లో కోహ్లీ, రోహిత్, ధోనిలకు దక్కని చోటు

ఐపీఎల్ 2022 బెస్ట్ టీమ్లో కోహ్లీ, రోహిత్, ధోనిలకు దక్కని చోటు

ఐపీఎల్ 2022 ఎడిషన్ పూర్తయింది. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్లో గుజరాత్ గెలిచి..ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే సీజన్ ముగిసిన నేపథ్యంలో మాజీ క్రికెటర్లు..తమ బెస్ట్ ఐపీఎల్ 2022 టీమ్ను ప్రకటిస్తున్నారు. తాజాగా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ 2022లో  తన అత్యుత్తమ జట్టును ప్రకటించాడు. 

ఓపెనర్లుగా రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ బట్లర్ , పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ధావన్కు అవకాశమిచ్చాడు. మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్‌స్టోన్‌లను తీసుకున్నాడు. మరో ఫినిషర్‌గా దినేష్ కార్తీక్‌ను సెలక్ట్ చేసుకున్నాడు సచిన్. ఓపెనర్లుగా ఎంపికైన బట్లర్ ఈ సీజన్లో 863 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ధావన్..14 మ్యాచుల్లో 38.33 సగటు, 122.67 స్ట్రైక్ రేట్ తో 460 రన్స్ సాధించాడు. మిడిల్లో కేఎల్ రాహుల్ 600కంటే ఎక్కువ పరుగులు సాధించగా, హార్దిక్ ఆల్‌రౌండర్‌గా, కెప్టెన్‌గా సత్తా చాటాడు. ఈ సీజన్‌లో దాదాపు 500 రన్స్ తో పాటు..8వికెట్లు కూడా తీయడం విశేషం. అటు డేవిడ్ మిల్లర్ 16మ్యాచ్‌లలో 68.71సగటుతో 143స్ట్రైక్ రేట్‌తో 481పరుగులు కొట్టాడు. లివింగ్‌స్టోన్  సిక్స్‌లతో రెచ్చిపోయాడు.  ఈ సీజన్లో 117మీటర్ల భారీ సిక్సర్ అతనే బాదాడు. ఫినిషర్  కార్తీక్ 16 మ్యాచ్‌లలో 55 సగటుతో 330పరుగులు చేశాడు. ఈ జట్టుకు హార్దిక్‌ పాండ్యాను  కెప్టెన్‌గా పేర్కొన్నాడు. 

తన టీమ్ బౌలింగ్ లైనప్‌లో సచిన్ టెండూల్కర్..బుమ్రాను ఎంపిక చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది.  ఈ ఐపీఎల్ సీజన్‌లో  బుమ్రా పెద్దగా రాణించనప్పటికీ...సచిన్ అతన్ని సెలక్ట్ చేశాడు.  14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు మాత్రమే తీశాడు. బుమ్రాతో పాటు.. షమీ, చాహల్, రషీద్ ఖాన్ ఉన్నారు. సచిన్ తన 2022 బెస్ట్ ఐపీఎల్ టీమ్లో  స్టార్ ప్లేయర్లకు ఛాన్స్ ఇవ్వలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోనీ, పంత్ లాంటి వాళ్లను సచిన్ పట్టించుకోలేదు. 

సచిన్ టెండూల్కర్ IPL 2022 టీమ్: జోస్ బట్లర్, ధావన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, లివింగ్‌స్టోన్, దినేష్ కార్తీక్, రషీద్ ఖాన్, షమీ, బుమ్రా, చాహల్.

అటు మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా తన  ఐపీఎల్-2022 బెస్ట్ టీమ్ ను ప్రకటించాడు. ఈ సీజన్లో అద్భుతంగా రాణించిన బెస్ట్ ప్లేయర్లకు తన టీమ్ లో చోటు కల్పించాడు పఠాన్. 

IPL 2022: Sachin Tendulkar picks his combined best XI of the tournament,  names Hardik Pandya captain

ఓపెనర్లుగా...
తన టీమ్ ఓపెనర్లుగా బట్లర్, కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేసుకున్నాడు పఠాన్.  ఈ సీజన్లో బట్లర్ నాలుగు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలతో 863పరుగులు సాధించాడు. కేఎల్ రాహుల్ 616పరుగులతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. వన్ డౌన్లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను సెలక్ట్ చేశాడు. అతను 17 మ్యాచుల్లో  రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేసినా..కీలక ఇన్నింగ్స్లతో జట్టును ఫైనల్ చేర్చాడు. ఐపీఎల్ 2022 ట్రోఫీ సాధించిన గుజరాత్ కెప్టెన్ పాండ్యా, పంజాబ్ హిట్టర్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్‌లకు మిడిలార్డర్లో ఛాన్స్ ఇచ్చాడు. ఈ టీమ్కు హార్థిక్ పాండ్యాను కెప్టెన్గా ఎంపిక చేశాడు పఠాన్. 

బౌలర్లుగా..
ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్, గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్, షమీ, ఉమ్రాన్ మాలిక్, చాహల్లను బౌలింగ్ లైనప్గా ఎంచుకున్నాడు.  రషీద్ 16మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టగా, పటేల్ 15 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు దక్కించుకున్నాడు. షమీ 20 వికెట్ల సాధించాడు. అయితే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను 12వ ఆటగాడిగా సెలక్ట్ చేసుకున్నాడు. 

పఠాన్ ఐపీఎల్ 2022 టీమ్-
జోస్ బట్లర్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), లివింగ్‌స్టోన్, మిల్లర్, రషీద్ ఖాన్, హర్షల్ పటేల్, షమీ, చాహల్, ఉమ్రాన్ మాలిక్,  కుల్దీప్ యాదవ్ (12వ ఆటగాడు)

ఇర్ఫాన్ పఠాన్ కూడా..స్టార్ ప్లేయర్లను పరిగణలోకి తీసుకోలేదు పంత్, ధోని, కోహ్లీ, రోహిత్లను ఎంపిక చేయలేదు. 

Twitter Reactions: Fans surprised as Irfan Pathan went unsold in the IPL  2017 Auction