విమర్శలకు కోహ్లీ స్ట్రాంగ్ కౌంటర్

విమర్శలకు కోహ్లీ స్ట్రాంగ్ కౌంటర్

వరుస  వైఫల్యాలతో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంటా బయటా తీవ్ర విమర్శలెదుర్కొంటున్నాడు. క్రికెట్లో కోహ్లీ సెంచరీ చేయక దాదాపు రెండేళ్లు దాటిపోయింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు, అభిమానులు అతనిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే కోహ్లీకి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, పాక్ కెప్టెన్ ఆజమ్ తో పాటు పలువురు ఆటగాళ్లు అండగా నిలుస్తూ ట్వీట్లు చేశారు. కోహ్లీ ఫాంలోకి వస్తాడని ధీమా వ్యక్తం చేశారు. కోహ్లీపై విమర్శలతో అతని పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. 

విమర్శకులకు కోహ్లీ గట్టి సమాధానం..


తన ఫాంపై సాగుతున్న చర్చపై విరాట్ కోహ్లీ స్పందించాడు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా కామెంట్స్ పెడుతున్న వారిపై గట్టిగా సమాధానం చెప్పాడు. సుతిమెత్తని పదాలతో వాళ్ల నోళ్లు మూయించాడు. డార్లింగ్ అంటూనే గర్జించాడు. డార్లింగ్ నేను కిందపడితే ఏంటి..నువ్వు పైకి ఎగిరితే ఏంటి అంటూ విమర్శకులను ఉద్దేశించి ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. 

2019లో చివరి సెంచరీ..
కోహ్లీ 2019లో సెంచరీ చేశాడు. అప్పటి సెంచరీతో ఇంటర్నేషనల్ క్రికెట్ లో 70 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఇంకో శతకం కొడితే..రికీ పాంటింగ్ 71 సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేస్తాడు. కానీ రెండేళ్లు దాటిపోయినా కోహ్లీ శతకాన్ని నమోదు చేయడం లేదు. గతంలో కోహ్లీ ఉన్న ఫాంను చూస్తే అతను ఈజీగా సచిన్‌ వంద సెంచరీల రికార్డును బద్దలు కొడతాడని అనుకున్నారు. ఆ తర్వాత ఫాం కోల్పోయిన కోహ్లీ టెస్టులు, వన్డేలు, టీ20ల్లో వరుసగా విఫలమవుతున్నాడు. 

2019 తర్వాత కోహ్లీ రన్స్..
2019 వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ 24 వన్డేలు ఆడాడు. ఇందులో  45.26 ఆవరేజ్ తో 1041 పరుగులు సాధించాడు.  ఇందులో రెండు శతకాలు, 10 హాఫ్ సెంచరీలున్నాయి. ఈ గణాంకాలు ఏ స్థాయిలో చూసిన బెటర్ గానే ఉన్నాయి. ఇక 2020 జనవరి నుంచి  కోహ్లీ 21 టీ20లు ఆడితే.. 42.18 సగటు, 136.08 స్ట్రైక్‌రేట్‌తో 675 రన్స్ కొట్టాడు.  ఇందులో 6 హాఫ్ సెంచరీలున్నాయి. ఈ గణాంకాలు టీ20ల్లో చక్కటి ప్రదర్శనే.  ఇక లాస్ట్ రెండేళ్లు 18 టెస్టులు ఆడాడు. ఇందులో  27.25 సగటుతో 872 పరుగులు మాత్రమే చేశారు. అయితే  ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. వన్డేలు, టీ20ల్లో మోస్తరు పర్ఫామెన్స్ ఉన్నా..టెస్టుల్లో మాత్రం విరాట్ ఘోరంగా విఫలమయ్యాడని చెప్పొచ్చు.