ఒంటరి వ్యక్తులే టార్గెట్..కోకాపేటలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు

ఒంటరి వ్యక్తులే టార్గెట్..కోకాపేటలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు

హైదరాబాద్: కోకాపేటలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సర్వీస్‌ రోడ్డులో ఆటో కోసం వేచిఉన్న వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఆటోలో ఎక్కించుకొని విచక్షణారహితంగా కొట్టారు. బాధితుడి జేబులో ఉన్న రూ.4,500 డబ్బును తీసుకొని ఆటోలో నుంచి తోసేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. ఆటోలో ముగ్గురు వ్యక్తులు వచ్చినట్లు గుర్తించారు. కోకాపేట సర్వీసు రోడ్డులో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇది ఐదోసారి. ఒంటరిగా ఉన్న వ్యక్తులను ఈ గ్యాంగ్​టార్గెట్​చేస్తోంది.