ముంబై ఇండియన్స్ పై కోల్ కతా విజయం

ముంబై ఇండియన్స్ పై కోల్ కతా విజయం

రసెల్‌ బాంబు మళ్లీ పేలింది. ఈసారి ఆ విధ్వంసానికి ముంబై బలైపోయింది. ఆండ్రీ రసెల్‌(40బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 80 నాటౌట్‌,2/25)కు ఆల్ రౌండ్‌ షోతో చెలరేగడంతో కోల్ కతా కీలక విజయం దక్కించుకుంది. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో 34పరుగుల తేడాతో ముంబైని ఓడించి ప్లేఆఫ్‌ రేసులో నిలిచింది. తొలుత రసెల్ తో పాటు శుభ్ మన్‌గిల్‌(45 బంతుల్లో 6ఫోర్లు,4 సిక్స-ర్లతో 76), క్రిస్‌ లిన్‌(29 బంతుల్లో 8ఫోర్లు,2 సిక్సర్లతో 54) చెలరేగడంతో కోల్ కతా 20 ఓవర్లలో రెండు వికెట్లనష్టానికి 232 పరుగులు చేసింది.ఈ సీజన్‌లో ఇది అత్యధిక స్కోరు కావడం విశేషం. ఛేజింగ్‌లో 20 ఓవర్లు ఆడిన ముంబై ఇండియన్స్‌ ఏడు వికెట్లనష్టానికి 198 పరుగులు చేసింది. హార్దిక్‌పాండ్యా (34 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో91) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో రైడర్స్‌కు చెమటలుపట్టించినా మిగిలిన బ్యాట్స్‌మెన్‌ విఫలమవడంతో ముంబైకి ఓటమి తప్పలేదు.

వామ్మో .. హార్దిక్
టాప్‌ బ్యాట్స్‌మెన్‌ అంతా పెవిలియన్‌కు క్యూ కట్టినవేళ హార్దిక్‌ పాండ్యా రెచ్చిపోయాడు. రసెల్ ను తలద-న్నెలా.. పూనకం వచ్చినట్లు సిక్స్‌లు, ఫోర్లు బాదేసినహార్దిక్‌ ఓ దశలో నైట్‌రైడర్స్‌ జట్టుకు ఓటమి భయంకలిగించాడు. భారీ టార్గెట్‌ ఛేజింగ్‌ను ముంబైఇండియన్స్‌ పేలవంగా ఆరంభించింది. నాలుగుఓవర్లు పూర్తయ్యే లోపే ఓపెనర్లు డికాక్‌(0), రోహిత్‌శర్మ(12) పెవిలియన్‌ చేరారు. పవర్‌ ప్లే తర్వాతబంతిని అందుకున్న రసెల్‌ రైడర్స్‌కు డబుల్‌ బ్రేక్‌ఇచ్చా డు. వేసిన తొలి బంతికే ఎవిన్‌ లూయిస్‌(15)ను ఔట్‌ చేసిన రసెల్‌, తొమ్మిదో ఓవర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌(26)ను పెవిలియన్‌కు పంపాడు.అయితే చావ్లా వేసిన తర్వాతి ఓవర్‌లో హార్దిక్‌ రెండుసిక్స్‌లు, పొలార్డ్‌ (20)ఓ ఫోర్‌ కొట్టారు . దీంతోపది ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్‌78/4తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. నరైన్‌ వేసిన11వ ఓవర్‌లో ఓ సిక్స్‌ కొట్టిన హార్దిక్‌, చావ్లా వేసినతర్వాతి ఓవర్‌లో మరో రెండు సిక్స్‌లు కొట్టాడు. ఈక్రమంలో జట్టు స్కోరు వంద మార్కును దాటేసింది. నరైన్‌ వేసిన14వ ఓవర్‌లో పొలార్డ్‌ ఔటైనా.. హార్దిక్‌మాత్రం ఓ సిక్సర్‌, ఫోర్‌ బాదేశాడు. 17 బంతుల్లోహాఫ్‌ సెంచరీ మార్కు చేరుకున్నాడు. ఆపై, హార్దిక్‌కు క్రునాల్‌ (24)జత కలిశాడు. చావ్లా వేసిన 16వఓవర్లో రెండు ఫోర్లు, నరైన్‌ వేసిన 17వ ఓవర్‌లో 4,6 కొట్టిన హార్దిక్‌.. గుర్నీ వేసిన 18వ ఓవర్‌లో 6,4కొట్టి రైడర్స్‌ గుండెల్లో గుబులు రేపాడు. అయితే ఆఓవర్‌ ఆఖరి బంతికి భారీ షాట్‌ ఆడిన హార్దిక్‌ డీప్‌ మిడ్‌వికెట్‌లో రసెల్ కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో ముంబై ఆశలు ఆవిరైపోయాయి.

కొట్టుడే కొట్టుడు
టాస్‌ ఓడి ఫస్ట్‌ బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు57 బంతుల్లో 96 పరుగులు జోడించిన శుభ్ మన్‌గిల్‌, క్రిస్‌ లిన్‌ జట్టు భారీ స్కోరుకు బాటలు వేశారు.ఇన్నింగ్స్‌ తొలి రెండు బంతులను బౌండ్రీకి తరలించిన గిల్‌, నాలుగో బంతికే సిక్సర్‌ కొట్టి ముంబై జట్టుకు హెచ్చరికలు పంపాడు. క్రునాల్‌ పాండ్యావేసిన నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన క్రిస్‌ లిన్‌కూడా దాటిగా ఆడడంతో పవర్‌ప్లే ముగిసే సరికి కోల్ కతా 50 పరుగులు చేసింది. అయితే క్రిస్‌ లిన్‌ను ఔట్‌ చేసి రాహుల్‌ చహర్‌ ముంబైకి బ్రేక్‌ ఇచ్చాడు. అనూహ్యంగా వన్ న్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఆండ్రీ రసెల్ తో కలిసి గిల్‌ మరింత రెచ్చిపోయాడు. ఇద్దరూ చకచకా బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. సెంచరీ చేసేలా కనిపించిన గిల్ ను హార్దిక్‌ పెవిలియన్‌ చేర్చాడు. హార్దిక్‌ వేసిన 16వ ఓవర్లో భారీషాట్ ఆడిన గిల్‌.. డీప్‌ మిడ్‌వికెట్‌లో లూయిస్‌కు దొరికిపోయాడు. దాంతో, రెండో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అప్పటికే స్కోరు150 దాటగా.. కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ వచ్చీరాగానే బ్యాట్‌కు పని చెప్పాడు. బుమ్రా వేసిన 17వ ఓవర్లో4, 6 కొట్టాడు. అయితే అప్పటిదాకా కాస్త నెమ్మదిగా ఆడిన రసెల్‌ ఒక్కసారిగా ఫుల్‌ స్వింగ్‌లోకి వచ్చేశాడు. హార్దిక్‌ వేసిన 18వ ఓవర్‌లో మూడు సిక్సర్లతో రెచ్చిపోయిన అతను.. బ్రుమా బౌలింగ్‌లో రెండుఫోర్లు బాదేశాడు. ఈ క్రమంలో జట్టు స్కోరును 200దాటించిన రసెల్‌ హాఫ్‌ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. మలింగ వేసిన చివరి ఓవర్లో రెండు ఫోర్లు,రెండు సిక్సర్లతో చెలరేగిన ఆండ్రీ కోల్ కతా ఇన్నింగ్స్‌కు అదిరిపోయే ఫినిషింగ్‌ ఇచ్చాడు.

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కతా : గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సి) లూయిస్‌ (బి) హార్ది క్‌ 76, లిన్‌ (సి)లూయిస్‌ (బి) రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 54, రసెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (నాటౌట్‌ ) 80, కార్తీక్‌ (నాటౌట్‌ ) 15; ఎక్స్‌ ట్రాలు : 7; మొత్తం: 20 ఓవర్లలో232/2; వికెట్ల పతనం: 1–96, 2–158; బౌల ింగ్‌ :బరీం దర్‌ 2–0–27–0, క్రునాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3–0–27–0, మలింగ4–0–48–0, బుమ్రా 4–0–44–0, రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4–0–54–1, హార్దిక్‌ 3–0–31–1.

ముంబై : డికాక్‌ (సి)రసెల్‌‌‌‌ (బి)నరైన్‌ 0, రోహిత్‌ (ఎల్బీ)గుర్నీ 12, లూయిస్‌ (సి) కార్తీక్‌ (బి) రసెల్‌‌‌‌ 15, సూర్యకు -మార్‌ (సి) కార్తీక్‌ (బి) రసెల్‌‌‌‌ 26, పొలార్డ్‌ (సి) రాణా(బి)నరైన్‌ 20, హార్దిక్‌ (సి) రసెల్‌‌‌‌ (బి) గుర్నీ 91, క్రునాల్‌‌‌‌ (సిఅండ్‌ బి) చావ్లా 24, బరీందర్‌ (నాటౌట్‌ ) 3, చహర్‌(నాటౌట్) 1; ఎక్స్‌ ట్రాలు: 6; మొత్తం : 20 ఓవర్లలో198/7; వికెట్ల పతనం: 1–9, 2–21, 3–41, 4–58,5–121, 6–185, 7–196; బౌలింగ్‌ : సందీప్‌ 4–0–29–0, నరైన్‌ 4–0–44–2, గుర్నీ 4–0–37–2, రసెల్‌‌‌‌ 4–0–25–2, చావ్లా 4–0–57–1.