SRH vs KKR: వర్షం అంతరాయం.. ప్రాక్టీస్ రద్దు చేసుకున్న కోల్‌కతా

SRH vs KKR: వర్షం అంతరాయం.. ప్రాక్టీస్ రద్దు చేసుకున్న కోల్‌కతా

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది.  సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా  నైట్ రైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదివారం (మే 26) టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిధ్యమిస్తున్న ఈ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ లవర్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేద్దామనుకున్న అభిమానులకు బ్యాడ్ న్యూస్. శనివారం (మే 25) చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ తమ ప్రాక్టీస్ సెషన్‌ను వర్షం కారణంగా నిలిపివేయాల్సి వచ్చింది.

వార్మప్ లో భాగంగా ఆటగాళ్లు ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ వైపు పరిగెత్తారు. ఫైనల్ కు ముందు కేకేఆర్ కు నాలుగు రోజుల విరామం లభించింది. దీంతో ఆటగాళ్లు మానసికంగా దృఢంగా ఉండడానికి కావాల్సినంత విరామం లభించింది. మరోవైపు సన్ రైజర్స్ కు ఒక్క రోజు విరామం లభించడంతో ప్రాక్టీస్ చేయకుండా రెస్ట్ తీసుకున్నారు. 

ఫైనల్ కు వర్షం పడే అవకాశం ఉందా..?

శనివారం (మే 25) సాయంత్రం చెన్నైలో వర్షం కురిసినా.. ఇవాళ మాత్రం ఆకాశం పూర్తిగా మేఘావృతంగా ఉండనుందని వెల్లడించి వాతావరణ శాఖ. వర్షం పడే అవకాశం 3 శాతం మాత్రమే ఉన్నాయని తెలిపింది. ఈ చివరి మ్యాచ్ లో మంచు ప్రభావం లేకపోవడంతో స్పిన్నర్లు హవా చూపారు. అందుకే ఇవాళ్టి మ్యాచ్ లో టాస్  గెలిచిన జట్టు బ్యాటింగ్  తీసుకునే అవకాశం ఉంది.

ఐపీఎల్  ఫైనల్ కు రిజర్వ్  డే ఉంది. దీంతో ఇవాళ వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే రేపు  నిర్వహిస్తారు. ఒకవేళ అప్పుడు కూడా ఆటకు అనుకూల పరిస్థితి లేక రద్దయితే కోల్ కతాను విజేతగా ప్రకటిస్తారు. ఎందుకంటే.. పట్టికలో కేకేఆర్  20 పాయింట్లతో అన్నిజట్లకన్నా టాప్ లో ఉంది.  ఆఖరి ఆటలో అదృష్టం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.