రాయల్‌ ఛాలెంజర్స్‌ పై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌  విక్టరీ

రాయల్‌ ఛాలెంజర్స్‌ పై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌  విక్టరీ

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వరుసగా ఐదో మ్యాచ్ లోనూ ఓడిపోయింది. చిన్న స్వామి స్టేడియం వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆండ్రూ రస్సెల్ ధాటికి…బెంగళూరు నిర్దేశించిన 206 పరుగుల భారీ లక్ష్యాన్నికోల్ కతా నైట్ రైడర్స్ మరో ఐదు బాల్స్ ఉండగానే చేధించింది. కోల్ కతా బ్యాటింగ్ లో ఓపెనర్ సునీల్ నరైన్ 10 పరుగులకే ఔటైనప్పటికీ..క్రిస్ లిన్ 43, రాబిన్ ఊతప్ప 33, నితీశ్ రాణా 37  పరుగులతో రాణించారు. చివర్లో 17 ఓవర్లు ముగిసే సమయానికి 18 బంతుల్లో 53 పరుగులు చేయాల్సిన టైమ్ లో  రస్సెల్ బ్యాట్ కు పని చెప్పాడు. 18 వ ఓవర్లో 23 పరుగులు రాబట్టిన రస్సెల్…టిమ్ సౌథి వేసిన 19 ఓవర్లో ఏకంగా 4 సిక్సులు, ఒక ఫోర్ తో 29 పరుగులు చేశాడు. దీంతో 6 బంతుల్లో ఒక పరుగులు చేయాల్సి ఉండగా…చివరి ఓవర్ మొదటి బంతికి సింగిల్ తీసిన శుభ్ మన్ గిల్ కోల్ కతాను గెలిపించాడు.

అంతకు ముంద టాస్ ఓడి బ్యాటింగ్  బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు…20 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 49 బాల్స్ లో 84 పరుగులు చేయగా…. ఏబీ డివిలియర్స్ 32 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 108 పరుగుల పార్ట్ నర్ షిప్ నమోదు చేశారు. చివర్లో మార్కస్ స్టయినిస్ 13 బంతుల్లో 28 పరుగులు చేయడంతో ఆర్సీబీ 205 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కోల్ కతా బౌలర్లలో నరైన్, రాణా, కుల్దీప్ చెరో వికెట్ పడగొట్టారు.

ఈ సీజన్ లో కోల్ కతాకు ఇది మూడో విజయం కాగా…బెంగళూరు వరుసగా ఐదో మ్యాచ్ లోనూ ఓడిపోయింది. 13 బాల్స్ లో 1 ఫోర్ 7 సిక్సర్లతో 48 పరుగులు చేసి కోల్ కతాను గెలిపించిన ఆండ్రూ రస్సెల్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యా చ్ దక్కింది.