నువ్వు ఎవడ్రా.. నా పానీపూరీ షాపు క్లీన్ గా పెట్టుకోమని చెప్పటానికి..

నువ్వు ఎవడ్రా.. నా పానీపూరీ షాపు క్లీన్ గా పెట్టుకోమని చెప్పటానికి..

వ్యాపారమే కాదు.. వ్యక్తిత్వాలు కూడా భిన్నంగా.. విభిన్నంగా ఉన్నాయి. ఇష్టం ఉంటే తిను.. లేకపోతే వెళ్లిపో.. నువ్వు ఎవడ్రా నా షాపు క్లీన్ గా పెట్టుకోమని చెప్పటానికి.. నీ చుట్టూ ఇంత మంది ఉన్నారు.. ఎవరైనా ఒక్క మాట అన్నారా.. ఇచ్చింది తింటున్నారు.. పెట్టింది తింటున్నారు.. నీ కళ్లకు కనిపించేది వాళ్లకు కనిపించటం లేదా ఏంటీ.. అయినా నువ్వు ఎవడ్రా నా షాపు క్లీన్ గా పెట్టుకోమని చెప్పటానికి.. మిగతా వాళ్లకు లేనిది నీకెందుకురా.. ఎలా ఇచ్చినా.. ఎలా పెట్టినా.. ఏది పెట్టినా కళ్లు మూసుకుని కమ్మగా తింటున్నారు కదరా.. నీకు ఇష్టం ఉంటేనే తిను.. లేకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపో.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. ఓ పానీపూరీ షాపు ఓనర్.. అవును ఓ పానీపూరీ షాపు ఓనర్ అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన క్లబ్ కచోరి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కోల్‌కతాలోని బారా బజార్‌లో లాలీ చంగాని అనే ఓ వ్యక్తి  క్లబ్ కచోరి వ్యాపారం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఫుడ్ వ్లాగ్స్ చేసే వారు ఇతని వద్దకు వచ్చి వీడియోలు తీయడంతో పాపులర్ అయ్యారు. పాపులర్ అయిన తరువాత అతని దగ్గర టేస్ట్ చేయకుండా ఎవరైన ఉంటారా.. ఎవ్వరూ ఉండరు.

ఈ క్రమంలోనే లాలీ చంగాని షాపుకు ఓ కస్టమర్ వచ్చి క్లబ్ కచోరి ఇవ్వమని అడిగాడు. కస్టమర్.. లాలీ దుకాణం చూసి శుభ్రంగా ఉంచుకుని అమ్మవచ్చు కదా అని సూచించాడు. దీంతో యజమానికి చిర్రెత్తుకొచ్చి కస్టమర్‌ను దుర్భాషలాడు. నీకు ఇష్టం ఉంటేనే తిను.. లేకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ గరం అయ్యాడు. ఈ సన్నివేశాన్నంతా సదరు కస్టమర్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలోకి వదిలాడు.

 దీంతో క్షణాల్లోనే వైరల్ గా మారింది. వీడియో పై నెటీజన్లు సీరియస్ గా కామెంట్స్ చేస్తున్నారు. "భారతదేశంలో అత్యంత అపరిశుభ్రమైన కచోరీ వాలా" అని కామెంట్ చేస్తున్నారు.