తరుగు పేరుతో రైతులను.. మోసం చేయడం సరికాదు.. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కయ్యారు

తరుగు పేరుతో రైతులను..  మోసం చేయడం సరికాదు.. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కయ్యారు

కొల్లాపూర్, వెలుగు : అధికారులు, మిల్లర్లు కుమ్మకై కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులో  క్వింటాల్ కు అదనంగా 8 నుంచి 10 కేజీలు తరుగు పేరుతో కోత విధించడం సరి కాదని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలో  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ఆయన పరిశీలించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ  తేమ , తాలు పేరుతో సాకులు చెప్పి ఎక్కువ తూకం వేయించుకుంటున్నారని పేర్కొన్నారు. ఐదు రోజులుగా రామాపురంలో వరి ధాన్యం కాంటాలు వేయకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.