
తమిళ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మహారాజ. దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో కూడా విడుదలైంది. రివెంజ్ అండ్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. కథ పాతదే అయినా దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం, విజయ్ సేతుపతి నటన వెరసీ సినిమాను నెక్స్ట్ లెవల్లో నిలబెట్టాయి. దాంతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ రాబట్టింది మహారాజ మూవీ.
ఇక ఈ సినిమా చూసిన నార్మల్ ఆడియన్స్ మొదలు టాప్ డైరెక్టర్స్..హీరోస్ వరకు ఫిదా అవుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన హీరో దళపతి విజయ్ మహారాజ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ నిథిలన్ ను, విజయ్ సేతుపతి నటనకు మెచ్చుకున్నారు.
ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు తెలుపుతూ..విజయ్ అన్నా.. మిమ్మల్ని కలిసుకోవడం సంతోషంగా ఉంది. ‘మహారాజ’ సినిమాను చూసి మీరు మెచ్చుకోవడమే కాకుండా సినిమాలో ప్రతి చిన్న విషయాన్ని చర్చించినందుకు ఆనందంగా ఉంది. ఇది నాకు దక్కిన గొప్ప అచివ్‌మెంట్. మీరు చూపించిన ప్రేమ ప్రోత్సాహానికి ధన్యవాదాలు అంటూ నిథిలన్ రాసుకోచ్చాడు.
Dear @actorvijay anna..
— Nithilan Saminathan (@Dir_Nithilan) July 18, 2024
Thank you for this enlightening meeting. I am grateful to have the chance to meet you. I am flattered by the details you have spoken about the #Maharaja. it is a great appreciation for me. I am very thankful for your love, support, and encouragement. Love… pic.twitter.com/kSgbswqr4H
మహారాజ కథ:
మహారాజ(విజయ్ సేతుపతి)..భార్య యాక్సిడెంట్ లో చనిపోవడంతో కూతురు జ్యోతితో కలిసి ఓ సెలూన్ నడుపుకుంటూ ఉంటాడు. అయితే యాక్సిడెంట్ తన కూతురిని ఇనుప చెత్తబుట్ట కాపాడుతుంది. అందుకే ఆ చెత్తబుట్టని లక్ష్మి అని పిలుస్తూ..ప్రేమగా చూసుకుంటాడు. కానీ, ఒకరోజు ఆ చెత్తబుట్ట కనిపించకుండా పోతుంది. వెతికిపెట్టమని పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు. ఇక మరోపక్క సెల్వం(అనురాగ్ కశ్యప్) దొంగతనాలు చేస్తూ ఉంటాడు. మరి మహారాజాకు, సెల్వంకు సంబంధం ఏంటి? ఆ చెత్తబుట్టకు లక్ష్మి అని పిలుచుకునేంత ప్రత్యేకత ఎందుకు? అనే విషయాలు తెలియాలంటే మహారాజ సినిమా చూడాల్సిందే.