
దీపావళి పండుగను పురస్కరించుకుని కొలువుల పండుగ నిర్వహిస్తోంది ప్రభుత్వం. అందులో భాగంగా ఆదివారం (అక్టోబర్ 19) హైదరాబాద్ శిల్పకళా వేదికలో కొలువుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లైసెన్స్డ్ భూ సర్వేయర్లకు నియామక పత్రాలు అందజేశారు.
సీఎం రేవంత్ స్పీచ్ ముఖ్యాంశాలు:
- లైసెన్స్డ్ సర్వేయర్లకు ఒక రోజు ముందే దీపావళి
- రాజులు , రాజ్యాల మధ్య భూమి కోసం యుద్ధాలు జరిగాయి
- తెలంగాణలో భూమికోసం, భుక్తి కోసం పోరాటాలు జరిగాయి
- విస్నూరు దొరపై చాకలి ఐలమ్మ పోరాటం చూశాం
- భూయజమానుల హక్కులు నిర్ణయించే అధికారం సర్వేయర్లకు ఉంది
- ధరణి చట్టం కొంతమంది దొరలకు చుట్టం అయ్యింది.
- భూమిపై ఆధిపత్యం కోసం ధరణి తీసుకొచ్చారు
- అధికారంలోకి వచ్చి ధరణి భూతాన్ని తొలగిస్తామని చెప్పాం.. తొలగించాం
- రైతులకు చుట్టంగా ఉండే భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చాం
- ఇందిరమ్మ హయాంలో సీలింగ్ యాక్ట్ చట్టం ద్వారా దాదాపు 25 లక్షల భూములను ఎస్సీ, ఎస్టీ, పేదలకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది
- 2006 చట్టం ద్వారా పది లక్షల పోడు భూములు పేదలకు ఇచ్చిన చరిత్ర తెలంగాణది
- కాంగ్రెస్ హయాంలో భూపంపిణీ జరిగింది
- గత పాలకులు నిరుద్యోగులను పట్టించుకోలేదు
- నిజామాబాద్ లో కుటుంబ సభ్యులు ఓడిపోతే వాళ్లకు పదవులు ఇచ్చారు..
- కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదు
- పదేళ్ల పాలనలో నోటిఫికేషన్లు ఇవ్వరు.. పరీక్షలు పెట్టరు..
- పెట్టినా పరీక్షా పత్రాలు పల్లీ బఠాణీలు అమ్ముకునే బండ్లమీద ప్రత్యక్షమవుతాయి
- కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం..
- ఎల్బీ స్టేడియంలో 60 నియామకాలు ఇచ్చాం.
- గ్రూప్1, గ్రూప్ 2 పరీక్షల పై ఎన్నో కేసులు వేసి.. నిరుద్యోగులతో చలగాటం ఆడాలని ప్రయత్నించారు
- కానీ సమయస్ఫూర్తితో, న్యాయనిపుణుల సహకారంతో న్యాయంగా ముందుకెళ్లి..
- హైకోర్టు, సుప్రీం కోర్టులో కొట్లాడి.. 563 మందికి గ్రూప్ 1 నియామక పత్రాలు ఇచ్చాం
- గ్రూప్ 2 అభ్యర్థులకు కూడా నియామక పత్రాలు ఇచ్చాం.
- ఆదివారం ( అక్టోబర్ 19) లైసెన్స్డ్ సర్వేయర్లకు నియామక పత్రాలు అందిస్తున్నాం
- తెలంగాణ రైసింగ్ 2047 డాక్యుమెంట్ కు ప్రణాళికలు చేస్తున్నాం
- స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తి చేసుకోబోతున్నాం.. అందుకే విజన్ డాక్యుమెంట్
- అందరినీ భాగస్వాములను చేస్తాం.. అందరి నుంచీ సలహాలు స్వీకరిస్తాం
- వ్యవసాయం అభివృద్ధి కావాలి.. వ్యవసాయం దండుగ కాదు.. పండుగ కావాలి.. రైతే రాజు కావాలి
- సర్వేయర్లు చేసిన కష్టానికి ఫీజు తీసుకోండి..
- కానీ తప్పులు చేయవద్దు.. రైతులను అన్యాయం చేయవద్దు
- మీరు బాధ్యతగా పనిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది
- ప్రభుత బాధ్యతను మీ భుజాలపై పెడుతున్నాం
- మా సైన్యం, ప్రతినిధులు మీరే.. మాకు వేరే ప్రతినిధులు లేరు
- మీరు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి.