కేసీఆర్.. నువ్వు మునుగోడు వస్తావా.. నన్ను గజ్వేల్ రమ్మంటావా : రాజగోపాల్ రెడ్డి సవాల్

కేసీఆర్.. నువ్వు మునుగోడు వస్తావా.. నన్ను గజ్వేల్ రమ్మంటావా : రాజగోపాల్ రెడ్డి సవాల్

బీజేపీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ ఓ సవాల్ చేశారు. సీఎం కేసీఆర్ టార్గెట్ గానే నా రాజకీయ జీవితం అన్నారు. మునుగోడులో పోటీ చేసి గెలిచి సత్తా ఉందా అని ప్రశ్నిస్తూనే.. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే గజ్వేల్ వెళ్లి.. కేసీఆర్ ను ఓడిస్తా అంటూ సవాల్ చేశారాయన. అక్టోబర్ 25వ తేదీ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఓపెన్ ఛాలెంజ్ చేశారు రాజగోపాల్ రెడ్డి. 

పోటీ చేసే నియోజకవర్గంపై వస్తున్న వార్తలపైనా క్లారిటీ ఇచ్చారు. మునుగోడు నుంచే పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేస్తూనే.. ఎల్బీ నగర్ నియోజకవర్గం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారాయన. మునుగోడు ఉప ఎన్నికల్లో నన్ను ఓడించటానికి 100 మంది ఎమ్మెల్యేలు వచ్చారని.. అవినీతి సొమ్ముతో గెలిచారంటూ విమర్శలు చేశారాయన. ఈసారి నన్ను ఓడ గొట్టే దమ్ముందా అంటూ కేసీఆర్ కు సవాల్ చేశారాయన. గజ్వేల్ లో కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ చురకలు అంటించారాయన. 

బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి చేరాడు అనగానే.. వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకున్నాడంటూ తప్పుడు ప్రచారం చేశారని.. ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నానని.. మరి ఆ ఆరోపణలకు బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారాయన. నిజంగా రాజగోపాల్ రెడ్డిని కొనే సత్తా ఎవరికైనా ఉందా అంటూ ప్రశ్నించారాయన. 

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ ఉందని.. ప్రజల కోసం.. ప్రజా సేవ కోసం తిరిగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్లు వెల్లడించారాయన. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాగు పడింది ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే అని.. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, యువత అందరూ కష్టాల్లో ఉన్నారన్నారు. తెలంగాణ సమాజం కేసీఆర్ కు బుద్ది చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 

ALSO READ :- Cricket World Cup 2023: మన దగ్గరే పాఠాలు: దక్షిణాఫ్రికా విజయాలపై మార్క్‌రమ్ కీలక వ్యాఖ్యలు