Cricket World Cup 2023: మన దగ్గరే పాఠాలు: దక్షిణాఫ్రికా విజయాలపై మార్క్‌రమ్ కీలక వ్యాఖ్యలు

Cricket World Cup 2023: మన దగ్గరే పాఠాలు: దక్షిణాఫ్రికా విజయాలపై మార్క్‌రమ్ కీలక వ్యాఖ్యలు

వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా సాధించిన విజయాలు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించడమే కాకుండా వాటిని భారీ విజయాలుగా మలిచిన తీరు అద్భుతం. నెదర్లాండ్స్ ఓటమి మినహాయిస్తే ఈ టోర్నీలో శ్రీలంక, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లపై కష్టపడకుండానే ఈజీ విక్టరీ కొట్టింది. పెద్దగా అంచనాలు లేకుండా వరల్డ్ కప్ లో అడుగుపెట్టిన సఫారీలు.. ప్రస్తుతం టైటిల్ ఫేవరేట్ గా మారారు. అయితే ఈ వరుస విజయాలకు అసలు కారణం చెప్పేసాడు వైస్ కెప్టెన్ మార్కరం. 

బవుమా గాయపడడంతో కెప్టెన్సీ బాధ్యతలు చేప్పట్టిన మార్కరం.. ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ మ్యాచుల్లో జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో సఫారీలు నాలుగు విజయాలతో సెమీస్ కు చేరువయ్యారు. ఇదిలా ఉండగా ఈ విజయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఐపీఎల్ అనుభవంతోనే చెలరేగుతున్నామని తెలిపాడు. ఇక్కడ ఆడటం మా ప్లేయర్లు చాలా నేర్చుకున్నారని.. పరిస్థితులని చక్కగా అవగాహన చేసుకున్నారని మార్కరం చెప్పుకొచ్చాడు. మొత్తానికి మన దగ్గర పాఠాలు నేర్చుకొని మన గడ్డపై అదరగొడుతుంది దక్షిణాఫ్రికా.

ALSO READ :- దసరాకి కొత్త కారు.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే

 
ప్రస్తుతం అద్భుత ఫామ్ లో ఉన్న మార్కరం, క్లాసన్, మార్కో జాన్సెన్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక డికాక్ లక్నో సూపర్ జయింట్స్, మిల్లర్ గుజరాత్ టైటాన్స్, రబడా పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నారు. వీరిలో డికాక్ 407 పరుగులతో టోర్నీ తా స్కోరర్ గా నిలిస్తే.. 288 పరుగులు చేసిన క్లాసన్ 150 స్ట్రైక్ రేట్ తో మెరుపులు మెరిపిస్తున్నాడు. జాన్సన్ ఆల్ రౌండ్ షో తో, మార్కరం కెప్టెన్ ఇన్నింగ్స్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. మరి ఇదే ఊపును టోర్నీ మొత్తం కొనసాగిస్తారా  లేకపోతే మధ్యలో చతికిలపడతారో చూడాలి.