దసరాకి కొత్త కారు.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే

దసరాకి కొత్త కారు.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే

సాహో(Sahoo)తో బ్యూటీ శ్రద్ధాకపూర్​(Shradda kapoor) లేటెస్ట్​ ఫొటోస్​ నెట్టింట వైరల్​గా మారాయి. దసరా రోజున ఓ కాస్ల్టీ కారును ఈ బ్యూటీ తనకు తాను గిఫ్ట్​ ఇచ్చుకుంది. లంబోర్గిని హురాకేన్ టెక్నికా(lamborghini huracan tecnica)​ అనే మోడల్​ కారును ఏకంగా రూ. 4 కోట్లు పెట్టి కొనుక్కుంది. ఈ విషయాన్ని శ్రద్ధా ఫ్రెండ్​ సోషల్​ మీడియాలో షేర్​ చేసింది. దీనిపై ఫ్యాన్స్​ ఈ హీరోయిన్​కు కంగ్రాట్స్​ చెప్తూ కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరేమో ఈ భామ లగ్జరీ లైఫ్​ చూసి ఎంతైనా మీరు డబ్బున్నోళ్లు అంటూ నిట్టూరుస్తున్నారు. బాలీవుడ్​లో భారీ రెమ్యూనరేషన్​ అందుకుంటున్న నటీమణుల్లో శ్రద్ధా ఒకరు. ఇటీవల ఆమె సినిమాలు అంతగా విజయం సాధించకపోయినా క్రేజీ ప్రాజెక్ట్స్​లో సైన్​ చేస్తూ దూకుడుగా ముందుకెళ్తోంది. ప్రస్తుతం హీరో రాజ్​ కుమార్​ రావ్​తో స్ట్రీట్​–2 సినిమాలో నటిస్తోంది. 

 ALSO READ :- కూతురి కోసం సినిమాలకు దూరం.. రణ్బీర్ షాకింగ్ డెసిషన్