దక్షిణ తెలంగాణపై సీఎం కేసీఆర్ వివక్ష చూపిస్తుండు

దక్షిణ తెలంగాణపై సీఎం కేసీఆర్ వివక్ష చూపిస్తుండు

మునుగోడు ఉపఎన్నికలో పార్టీ స్టార్ క్యాంపెయినర్గా బాధ్యతలు అప్పగిస్తే ప్రచారం చేస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ దక్షిణ తెలంగాణ వివక్ష చూయిస్తున్నారని ఆరోపించారు. చౌటుప్పల్, గుడిమల్కాపురం రోడ్డును ఆరు నెలల క్రితం అడిగితే పట్టించుకోలేదని..ఇప్పుడు ఉపఎన్నిక వస్తుందని హడావిడిగా రోడ్డు వేస్తున్నారని అన్నారు. ఈ రోడ్డు కాంట్రాక్టర్ సీఎం కేసీఆర్ కు బంధువని చెప్పారు. 

సీఎం ఫాంహౌస్ చుట్టూ 600 కోట్లతో 3 నెలల్లో రోడ్లు వేస్తే..ఈ చిన్న రోడ్డును వేయడానికి ఏడాది పట్టిందని కోమటిరెడ్డి అన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో రోడ్లు బాగుంటాయి కానీ మిగితా నియోజకవర్గాల్లో ఎందుకుండయని ప్రశ్నించారు. 350 కోట్లతో పిలాయిపల్లి కాలువ ప్రారంభిస్తానని సీఎం కేసీఆర్ చెప్పగా..అందులో 50 కోట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోచకున్నారని ఆరోపించారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటలో, 20వేల డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తే మునుగోడులో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. కాగా దేశం కోసం ప్రాణాలర్పించిన మహానీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కోమటిరెడ్డి అన్నారు. సర్దార్ అనే బిరుదు మొదటగా వచ్చింది ఆయనకేనని చెప్పారు.