ఎయిర్ పోర్టుల భద్రత, సంరక్షణపై మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు..

ఎయిర్ పోర్టుల భద్రత, సంరక్షణపై మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు..

దేశవ్యాప్తంగా వివిధ ఎయిర్ పోర్టులలో ప్రయాణికుల భద్రత, సంరక్షణ లో లోపాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న క్రమంలో మంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు. 

తెలంగాణలోని ఎయిర్ పోర్ట్ ల్లో ప్రయాణికుల సంరక్షణకు, భద్రతకు తీసుకోవాల్సిన అత్యవసర మార్గదర్శకాలపై వారం రోజుల్లో  భద్రత తనిఖీలు (సేఫ్టీ ఆడిట్) నిర్వహించాలనిశ్రీ కోమటిరెడ్డి ఆ శాఖ స్పెషల్ సెక్రెటరీ దాసరి హరిచందనను ఆదేశాంచారు.వారం రోజుల్లో సెఫ్టీ ఆడిట్ ను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.