రాష్ట్ర రహదారులను జాతీయ హైవేలుగా గుర్తించండి: కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాష్ట్ర రహదారులను జాతీయ హైవేలుగా గుర్తించండి: కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాష్ట్ర రహదారులను జాతీయ హైవేలుగా గుర్తించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు కాంగ్రెస్ నాయకులు, ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇందుకుగాను గడ్కరీకి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల సమయంలో జాతీయ రహాదారుల విషయంలో సీఎం కేసీఆర్ ఊకదంపుడు ఉపన్యసాలు ఇచ్చి ఇప్పుడు మరిచారని అన్నారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను కేంద్రమే గుర్తించి జాతీయ రహదారులుగా మారుస్తరని… సీఎం పట్టించుకోవడం మనేశారని వెంకట్ రెడ్డి అన్నారు.

2018 ఎన్నికల ప్రచారసభలలో 3,150 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి అభివృద్ధి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేసిందని అన్నారు వెంకట్ రెడ్డి. అయితే.. కేవలం 1300 కిలోమీటర్ల మేర రహదారులనే కేంద్రం, జాతీయ రహదారులుగా గుర్తించిందని తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారి 8 లైన్ల రహదారి చేయాలని చేసిన 6 లైన్ల రహదారిలో ఎల్బీ నగర్ నుంచి కుత్బుల్లాపూర్ వరకు వదిలేశారు చెప్పారు. దాన్ని కూడా విస్తరించాలని గడ్కరిని కోరానని తెలిపారు.

మహిళ అధికారి పై దాడి ఘటన చూస్తే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం వస్తుందని వెంకట్ రెడ్డి అన్నారు. పోలీసులకు ఉన్నట్లే అటవీ అధికారులకు సైతం లైసెన్స్డ్ ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  చిన్నపాపపై హత్యాచారం జరిగితే సీఎం కేసీఆర్ కు పరామర్శించేందుకు సమయం లేని ముఖ్యమంత్రిని తాను ఎన్నడూ చూడలేదని చెప్పారు. సచివాలయానికి రాని ముఖ్యమంత్రి కి కొత్త సచివాలయం ఎందుకని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంపై కోర్టు ను ఆశ్రయిస్తానని చెప్పారు. అధికారం ఉన్న ముఖ్యమంత్రి సచివాలయానికి రాడు, సచివాలయానికి వచ్చే మంత్రులకు అధికారం లేదని అన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.