మరో 45 రోజుల్లో అసెంబ్లీ రద్దయితది: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మరో 45 రోజుల్లో  అసెంబ్లీ రద్దయితది: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణలో మరో 45 రోజుల్లో అసెంబ్లీ రద్దు కాబోతుందన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా మాజీలు కాబోతున్నారని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల వద్ద నేషనల్ హైవే నిర్మాణ పనులను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కోమటిరెడ్డి గౌరెల్లి నుంచి కొత్త గూడెం వరకు 2 వేల కోట్లతో  నేషనల్ హైవేను కేంద్రమంత్రితో మాట్లాడి మంజూరు చేయించానని చెప్పారు.  జాతీయ రహదారులు ఎప్పుడు స్థానికి ఎంపీ అభ్యర్థన మేరకే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని..అది కూడా తెలియని కేటీఆర్  అమెరికాలో చదివానని చెబుతారని  ఎద్దేవా చేశారు.   ఇసుక మాఫియాలో, వైన్ మాఫియాలో,గల్లీల్లో తిరిగే గాదరి కిషోర్ కు  ఢిల్లీ ఎక్కడుందో తెలుసా అని ప్రశ్నించారు.

ALSO READ :అవసరమైతే సీతక్కను సీఎం చేస్తాం:రేవంత్ రెడ్డి

మంత్రి జగదీష్ రెడ్డి అక్రమంగా సంపాదించిన 3 వేల కోట్లతో శంషాబాద్ దగ్గర 80 ఎకరాల భూమి కొన్నారని ఆరోపించారు. అక్రమ సంపాదనలో గాదరి కిషోర్ , జగదీశ్ రెడ్డితో పోటీపడుతున్నారని అన్నారు.   బెంజ్ కారులో తిరుగుతాడని కొందరు తనను విమర్శిస్తున్నారని..తాను 30 సంవత్సరాల క్రితం యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడే బెంజ్ కారు లో తిరిగానని చెప్పారు కోమటిరెడ్డి. కష్టపడి వ్యాపారాలు చేసి సంపాదించా.. కానీ స్కూటర్ మీద తిరిగిన జగదీష్ రెడ్డిలా  అక్రమంగా వేల కోట్లు సంపాదించలేదన్నారు. అక్రమాలు ఆగాలన్నా.. తెలంగాణ లూటీ ఆగాలన్నా  వచ్చే  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. 

ఐటీ మినిష్టర్ అయ్యిండి కూడా కేటీఆర్ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.   కాంగ్రెస్ ప్రభుత్వం లో ముఖ్య మంత్రిగా ఎవరున్నా మొదటి సంతకం 4 వేల రూపాయల పెన్షన్ పైనే చేస్తారని చెప్పారు.   ఈ నెల 20 వ తేదీన కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ పాల్గొన బోయే సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించబోతున్నామని చెప్పారు.  నాలుగు పార్టీలు మారిన సుఖేందర్ రెడ్డి 12 కార్లలో తిరుగుతున్నారని.. అంత ప్రాణ భయం దేనికని ప్రశ్నించారు.