కేసీఆర్ కు హరీశ్ వెన్నుపోటు పొడుస్తడేమో?: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కేసీఆర్ కు హరీశ్ వెన్నుపోటు పొడుస్తడేమో?: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

 

  • సీఎం కావాలనే ప్లాన్ లో హరీశ్ రావు
  • కేసీఆర్ కు వెన్నుపోటు పొడుస్తడేమో?
  • ఆయన కేసీఆర్ ను వ్యతిరేకించి వస్తే సపోర్ట్ చేస్తం
  •  60 కిలోలున్న కేసీఆర్ పులి అయితే.. నేనేం కావాలె
  • రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇవాళ అసెంబ్లీ లాబీలో ఆయన చిట్ చాట్ చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు మంత్రి కావాలని  ప్లాన్ లో ఉన్నట్టున్నారన్నారు. ఆయన వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్ కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని చెప్పారు. హరీశ్ కేసీఆర్ ను వ్యతిరేకించి వస్తే సపోర్ట్ చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, కవిత పేర్లమీద విడిపోతుందని, ఇప్పుడున్న బీఆర్ఎస్  నాలుగు పార్టీలవుతుందని అన్నారు. 

ఆ పార్టీలో ఉంటే హరీశ్ రావు ఎల్పీ లీడర్ కూడా కాలేరని చెప్పారు. ఆయన 20 మంది ఎమ్మెల్యేల మద్దతులో ఆ పార్టీ లీడర్ కావాలని అన్నారు. కట్టె పట్టుకొని తిరిగే కేసీఆర్ పులి ఎట్లయితరని కోమటిరెడ్డి అన్నారు. 60 కిలోలున్న కేసీఆరే పులి అయితే 86 కిలోలున్న తానేం కావాలని అన్నారు. ఇంకో 20 ఏండ్ల వరకు కాంగ్రెస్  పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పారు.